iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ- దిల్ రాజు కాంబో రిపీట్.. టైటిలే ఊరమాస్ గా ఉంది!

Dil Raju- Vijay Devrakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తెలుగులో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆ ఫాలోయింగ్ కి తగ్గట్లు మరోసారి దిల్ రాజు కాంబోలో రాబోతున్నాడు. ఆ ప్రాజెక్టుకు టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Dil Raju- Vijay Devrakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తెలుగులో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆ ఫాలోయింగ్ కి తగ్గట్లు మరోసారి దిల్ రాజు కాంబోలో రాబోతున్నాడు. ఆ ప్రాజెక్టుకు టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ- దిల్ రాజు కాంబో రిపీట్.. టైటిలే ఊరమాస్ గా ఉంది!

ది విజయ్ దేవరకొండ కెరీర్లో కాస్త ఆచీ తూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృణాళ్ ఠాకూర్ తో జంటగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే ఆ మూవీ ప్రస్తుతం ఓటీటీలో కూడా దున్నేస్తోంది. ఫ్యామిలీ సినిమా విషయంలో తన గురి తప్పదు అని చెప్పే దిల్ రాజు.. అది నిజమని మరోసారి రుజువు చేశారు. అలాగే ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రామిసింగ్ ప్రొడ్యుసర్ గా మారోసారి నిలిచారు. అయితే విజయ్ దేవరకొండతో దిల్ రాజు కాంబినేషన్ ఇక్కడితో ఆగేది కాదు.. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో చెప్పిన విషయం తెలిసిందే. మరో రెండు సినిమాలు విజయ్ దేవరకొండతో చేయబోతున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఒక మూవీ టైటిల్ కూడా వచ్చేసింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక నమ్మకం ఉంది. ఒక డైరెక్టర్ ని, ఒక కథని ఆయన నమ్మాడు అంటే అది గురి తప్పదు అని తెలుగు ఆడియన్స్ కి తెలుసు. అదే నమ్మకాన్ని ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ సమయంలోనే విజయ్ దేవరకొండ గురించి గొప్పగా చెప్పడం మాత్రమే కాకుండా.. మరో రెండు సినిమాలు ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ నిర్మాత గురించి ఆలోచించే హీరో అని ప్రశంసలు కురిపించిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీళ్ల కాంబో రిపీట్ కాబోతోంది. ఆ ప్రాజెక్టుకి దాదాపుగా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది అంటున్నారు.

విజయ్ దేవరకొండ కోసం ఒక పాన్ ఇండియా కథ రెడీగా ఉందని చెప్పారు. ప్రీ పొడక్షన్స్ వర్క్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు. అయితే విజయ్ దేవరకొండతో తీయబోయే సినిమా టైటిల్ అని చెప్పి నెట్టింట ఒకటి వైరల్ గా మారింది. అదేంటంటే.. “రౌడీ జనార్థన్” వంటి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అధికారిక ప్రకటన కాదు. కేవలం గాసిప్ మాత్రమే. ఈ తరహాలో మూవీ పేరు ఉండచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ఎంత వరకు ఫైనల్ అవుతుందో చెప్పడానికి లేదు. ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

గోవర్దన్ క్యారెక్టర్లో ఉండే వేరియేషన్స్, కుటుంబంపై ఉండే ఆపేక్ష, తన కుటుంబం జోలికి వస్తే ఎందుకైనా తెగించే అతని తెగువుకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇప్పుడు ఈ రౌడీ జనార్థన్ టైటిల్ చూస్తే.. మూవీ ఊరమాస్ ఉండబోతోంది అనిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ కొంతసేపు మాత్రమే మాస్ క్యారెక్టర్లో కనిపించాడు. కానీ, ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అధికారిక టైటిల్ కూడా అయితే సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. కాకపోతే అధికారక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş