iDreamPost
android-app
ios-app

పండగ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో భార్య!

  • Author Soma Sekhar Published - 01:59 PM, Mon - 18 September 23
  • Author Soma Sekhar Published - 01:59 PM, Mon - 18 September 23
పండగ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో భార్య!

సెలబ్రిటీలు తమ ఇంట్లో ఏ చిన్న వేడుకైనా.. లేదా విశేషమైనా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా అభిమానులతో పంచుకునే విషయాల్లో తొలి స్థానంలో వారికి వారసుడు లేదా వారసురాలు వచ్చిందనే వార్తలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా అలాంటి వార్తనే తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు కన్నడ హీరో ధృవ సర్జా. ఇటీవలే తన భార్య సీమంతాన్ని తన అన్న స్వర్గీయ చిరంజీవి సర్జా సమాధి దగ్గర నిర్వహించి వార్తల్లోకి ఎక్కాడు ధృవ సర్జా. కాగా.. వినాయక చవితి పండగ రోజే సర్జా భార్య ప్రేరణ శంకర్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ధృవ సర్జా వెల్లడించాడు.

ధృవ సర్జా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ధృవ సర్జా-ప్రేరణ శంకర్ దంపతులకు వినాయక చవితి పండగ రోజే రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ప్రేరణ శంకర్ పండగ రోజే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సర్జా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. నార్మల్ డెలివరీ అయ్యిందని, మరోసారి ఆడబిడ్డ పుట్టిందని తెలిపాడు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. కొన్ని రోజుల క్రితం తన భార్య సీమంత ద్వారా వార్తల్లోకి ఎక్కాడు ధృవ సర్జా. ఈ సీమంతం వేడుకను తన అన్న దివంగత చిరంజీవి సర్జా సమాధి వద్ద నిర్వహించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అన్నయ్య ఆశీర్వాదాలు తన కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలనే ఇక్కడ సీమంతం వేడుకను నిర్వహించినట్లు అతడు చెప్పుకొచ్చాడు. ఇక పండగ రోజే తండ్రైన ఈ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa)