iDreamPost
android-app
ios-app

అసిస్టెంట్ పెళ్లిలో హీరో ధనుష్ సందడి.. వైరలవుతున్న వీడియో!

  • Author Soma Sekhar Published - 12:57 PM, Mon - 18 September 23
  • Author Soma Sekhar Published - 12:57 PM, Mon - 18 September 23
అసిస్టెంట్ పెళ్లిలో హీరో ధనుష్ సందడి.. వైరలవుతున్న వీడియో!

హీరోలు ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు సర్ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు. తమ వీరాభిమాని పెళ్లికి, లేదా వారి ఇంటి గృహప్రవేశానికి లేదా ఇంకేదైనా కార్యక్రమాలకు హాజరవుతూ.. వారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. ఇక వారి వ్యక్తిగత సహాయకులు జరుపుకునే వేడుకలకు కొంత మంది హీరోలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతూ.. వారిని సర్ఫ్రైజ్ చేస్తుంటారు. కాగా.. ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక తన అసిస్టెంట్ పెళ్లికి హాజరై.. సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరో ధనుష్ సైతం తన అసిస్టెంట్ వివాహానికి విచ్చేసి.. ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. విలక్షణమైన సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా అతడు చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన అసిస్టెంట్ అయిన ఆనంద్ వివాహానికి ప్రత్యేక అతిథిగా హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వేడుకకు వెరైటీ లుక్ లో వచ్చాడు ధనుష్. అయితే అక్కడే ఉన్న రాధిక, శరత్ కుమార్ లను ధనుష్ కలుసుకున్నారు. వీరితో పాటుగా అసురన్ సహనటుడు కెన్ కరుణాస్ కూడా ఈ పెళ్లికి హాజరైయ్యాడు.

కాగా.. ప్రస్తుతం ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయి.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టింది. ఈ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా.. ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన ధనుష్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabet