iDreamPost

ఓలీ పోప్‌ ఫన్నీ ఔట్‌.. అంతా ధృవ్‌ జురెల్‌ మాయా! చెప్పి మరీ..

  • Published Mar 07, 2024 | 12:58 PMUpdated Mar 07, 2024 | 12:58 PM

Dhruv Jurel, Kuldeep Yadav: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ ధృవ్‌ జురెల్‌ ఓ సూపర్‌ వికెట్‌లో భాగస్వామి అయ్యాడు. ఈ అవుట్‌తో దిగ్గజ మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ధోనిని గుర్తుచేశాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Dhruv Jurel, Kuldeep Yadav: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ ధృవ్‌ జురెల్‌ ఓ సూపర్‌ వికెట్‌లో భాగస్వామి అయ్యాడు. ఈ అవుట్‌తో దిగ్గజ మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ధోనిని గుర్తుచేశాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 07, 2024 | 12:58 PMUpdated Mar 07, 2024 | 12:58 PM
ఓలీ పోప్‌ ఫన్నీ ఔట్‌.. అంతా ధృవ్‌ జురెల్‌ మాయా! చెప్పి మరీ..

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌ ఇంగ్లండ్‌ మంచి స్టార్‌ అందించారు. తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించిన తర్వాత డకెట్‌.. శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ చివరి బంతిని డకెట్‌ గాల్లోకి లేపాడు. కవర్స్‌లో నిల్చున్న గిల్‌.. వెనక్కి పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన ఓలీ పోప్‌ కూడా బాగానే బ్యాటింగ్‌ చేశాడు. బాగా ఆడుతున్న ఓపెనర్‌ జాక్‌ క్రాలేకు ఎక్కువగా స్ట్రైక్‌ ఇచ్చాడు. కానీ, తాను మరీ ఎక్కువగా డాట్స్‌ బాల్స్‌ ఆడటంతో అతనిపై ఒత్తిడి పెరిగింది.

ఈ క్రమంలోనే కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ ఆడటంలో ఇబ్బంది పడుతున్న ఓలీ పోప్‌.. ముందుకొచ్చి కుల్దీప్‌ స్పిన్‌ను కట్‌ చేద్దాం అనుకున్నాడు. ఓలీ పోప్‌ ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేయబోతున్నాడని గ్రహించిన వికెట్‌ కీపర్‌ ధృవ్‌ జురెల్‌ ఇదే విషయాన్ని బౌలర్‌ కుల్దీప్‌కు చెప్పాడు. ‘ఏ ఆగే బడేగా.. ఆగే బడేగా’ అంటూ హిందీలో ఇతను ముందుకొచ్చి ఆడతాడు, ముందుకొచ్చి ఆడతాడు అంటూ కుల్దీప్‌కు హింట్‌ ఇచ్చాడు. ఈ మాత్రం హింట్‌ ఇస్తే చాలు రెచ్చిపోతా అన్నట్లు కుల్దీప్‌ సైతం ఓలీ పోప్‌కు ఊరించే బంతిని వేశాడు. అంతే ఓలీ పోప్‌ ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేయడం.. బాల్‌ను మిస్‌ అవ్వడం, కీపర్‌ జురెల్‌ బాల్‌ను అందుకుని మెరుపు వేగంతో బెయిల్స్‌ను ఎగరేశాడు.

అయితే.. ముందుకొచ్చి ఆడే క్రమంలో ఓలీ పోప్‌ దాదాపు సగం పిచ్‌కి వెళ్లిపోయాడు. అతని స్టంప్‌ అవుట్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మొత్తం ఔట్‌ ఎపిసోడ్‌లో వికెట్‌ కీపర్‌ ధృవ్‌ జురెల్‌కి ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వాలి. ఎందుకంటే.. ఒత్తిడిలో ఉన్న బ్యాటర్‌ గేమ్‌ను అర్థం చేసుకుని, అతను నెక్ట్స్‌ ఏం చేయబోతున్నాడో రీడ్‌ చేసి.. బౌలర్‌కు సూచనలు ఇవ్వడంతో ఈ వికెట్‌ దక్కింది. పోప్‌ ముందుకొచ్చి ఆడతాడని తెలియకపోతే కుల్దీప్‌ అలాంటి బాల్‌ వేసేవాడు కాదేమో.. అందుకే ఇది కచ్చితంగా జురెల్‌ పోప్‌ను ట్రాప్‌ చేసినట్లే లెక్క. ధృవ్‌ జురెల్‌ను చాలా మంది జూనియర్‌ ధోని అంటున్నారు.. ఈ బిరుదును నిలబెట్టుకుంటున్నట్లు జురెల్‌ కనిపిస్తున్నాడు. మరి ఈ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి