iDreamPost

వికేంద్రీకరణకు జై కొట్టిన వెంకయ్యనాయుడు

వికేంద్రీకరణకు జై కొట్టిన వెంకయ్యనాయుడు

మూడు రాజధానుల ప్రతిపాదనలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జైకొట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌ ప్రథమ వార్సికోత్సవం సందర్భంగా వెంకయ్యనాయుడు పై విధంగా స్పందిచారు. నగరాలకు వలస వచ్చే వారి సంఖ్య తగ్గాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వెంకయ్య అభిలషించారు. అప్పుడే అటు పట్టణాలు, గ్రామాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు పార్టీలోని వివిధ ప్రాంతాల నేతలు వైఎస్సార్‌సీపీ సర్కార్‌ మూడు ప్రతిపాదనలకు జై కొట్టారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల టీడీపీ నేతలు జగన్‌ సర్కార్‌ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఇక ఇప్పుడు చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రతి అంశంలో బాబుకు మద్దతుగా మాట్లాడే వెంకయ్య నాయుడు అభివృద్ధి వికేంద్రికరణకు జై కొట్టడంతో రాజధాని విషయంలో చంద్రబాబు ఒంటిరిగా మిగిలారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిన్న మంగళవారం రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు నెల్లూరులో వెంకయ్యనాయుడని కలిశారు. రాజధానిపై తమ డిమాండ్లకు మద్దతుగా నిలవాలని కోరినా వెంకయ్య తన వైఖరిని వెల్లడించలేదు. తన స్థాయిలో ఈ అంశంపై ఇప్పుడు మాట్లాడలేనని దాటవేయడంతో మూడు రాజధానుల ప్రతిపాదనకు వెంకయ్య నాయుడు కూడా మొగ్గు చూపారని మీడియా వర్గాలు అంచనా వేశాయి. తాజాగా తాడేపల్లిగూడెం నిట్‌లో అభివృద్ధి వికేంద్రీకరణపై చేసిన ప్రసంగంతో వెంకయ్య తన వైఖరిని స్పష్టం చేసినట్లైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి