iDreamPost

7 వారాలకి అశ్వినీ రెమ్యూనరేషన్! ఇది కదా లక్ అంటే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. 12వ వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్వినీ శ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే 7 వారాలకు అశ్వినీ శ్రీకి ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ దక్కిందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. 12వ వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్వినీ శ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే 7 వారాలకు అశ్వినీ శ్రీకి ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ దక్కిందంటే?

7 వారాలకి అశ్వినీ రెమ్యూనరేషన్! ఇది కదా లక్ అంటే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట 13 వారానికి చేరుకుంది. ఈ సీజన్ మరో రెండు వారాల వరకు పొడిగించే అవకాశం ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 12వ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. పల్లవి ప్రశాంత్ తన ఎవిక్షన్ పాస్ ని వాడకపోవడంతో అశ్వినీ, రతికాలో ఎవరూ సేవ్ కాలేదు. శనివారం అశ్వినీ, ఆదివారం రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఎవరికి వాల్లు ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ వాడతాడు అని ఎంతో ఆశ పడ్డారు. కానీ, ప్రశాంత్ మాత్రం ఆ పాస్ ని 14వ వారంలో మాత్రమే వాడతానంటూ శపథం చేశాడు. ఇంక చేసేది లేక ఈ ఇద్దరూ ముద్దుగుమ్మలు బిగ్ బాస్ హౌస్ ని వీడక తప్పలేదు.

ఆట విషయానికి వస్తే.. రతికా రోజ్ తో పోలిస్తే అశ్వినీ శ్రీ పర్వాలేదు అనిపించింది. వచ్చిన తొలి వారాల్లో మాత్రం అశ్వినీ ఎంతో సైలెంట్ గా కనిపించింది. ఆటల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు. హౌస్ లో ఎవరూ తనతో కలవడం లేదంటూ ఒక్కతే బాధపడేది. భోలేతో క్లోజ్ అయిన తర్వాత భోలే షావలీ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత చిన్నగా హౌస్ మేట్స్ తో కలవడం ప్రారంభించింది. కానీ, గేమ్ పరంగా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పైగా ప్రియాంక, శోభాలతో రాజమాతల టాస్కులో వాళ్లు కాళ్లు పట్టుకుని తనని తాను తక్కువ చేసుకుంది. అలాగే 12 వారం నామినేషన్స్ లో ఎవరి మీద పాయింట్స్ లేవంటూ సెల్ఫ్ నామినేషన్ చేసుకుంది.

ఆమె ఎప్పుడైతే సెల్ఫ్ నామినేషన్ చేసుకుందో.. ఆ తర్వాత ఆడియన్స్ లో కూడా ఆమెపై నమ్మకం పోయింది. ఉన్న ఒక్క ఓటు ఎందుకు అశ్వినీకి వేయాలి? అనే ప్రశ్నకు వచ్చారు. అందుకే అశ్వినీ శ్రీ 12వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ముఖ్యంగా ఆమెకు డిఫెండింగ్ స్కిల్స్ లేవు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఏడ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో అంత మెత్తగా ఉంటే పని కాదు. అదే విషయం మరోసారి అశ్వినీ విషయంలో రుజువైంది. ఎందుకంటే ఆ హౌస్ లో ఉండాలి అంటే ఎదుటివాళ్లు మనల్ని చూసి అరుస్తాడు అనే ఆలోచన వచ్చినా కూడా.. ముందు మీరే అరిచేయాలి. అంత ధైర్యం, తెగువ ఉన్నవాళ్లే అలాంటి బిగ్ బాస్ రియాలిటీ షోలకు సెట్ అవుతారు. ఇంక వచ్చేస్తూ అశ్వినీ శ్రీ ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్ అనే విషయాలను చెప్పింది. రతికా రోజ్, ప్రియాంకలు మాత్రం ఫ్లాప్ అని చెప్పింది.

మిగిలిన వాళ్లు అందరూ హిట్, సూపర్ హిట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇంక ప్రియాంక విషయంలో మాత్రం బయటకు వెళ్లే సమయంలో కూడా వారికి సెట్ కాలేదు అనే విషయం స్పష్టమైంది. ఇంక అశ్వినీ శ్రీ రెమ్యూనరేషన్ గురించి అందరూ అడుగుతున్నారు. అసలు అశ్వినీకి ఎంత రెమ్యూనరేషన్ వచ్చిందంటూ వెతుకుతున్నారు. ఆమె హౌస్ లో మొత్తం 7 వారాలు ఉంది. ఆమెకు ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే 7 వారాలకు గాను.. రూ.14 లక్షలు ఆమెకు రెమ్యూనరేషన్ కింద దక్కింది. నిజానికి మొదటి 5 వారాలకు కూడా వీళ్లకు రెమ్యూనరేషన్ ఇచ్చే పనైతే.. అశ్వినీకి మొత్తం రూ.24 లక్షలు రెమ్యూనరేషన్ దక్కినట్లు అవుతుంది. నిజానికి అశ్వినీకి చాలా మంచి పారితోషకం దక్కినట్లే. మరి.. అశ్వినీ శ్రీని రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి