iDreamPost

New Feature In UPI: గుడ్ న్యూస్ చెప్పిన RBI! UPIలో కొత్త ఫీచర్.. ఆ కష్టాలకు చెక్!

UPIలో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీంతో ఆ కష్టాలకు చెక్ పడనుంది. ఈ ఫీచర్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

UPIలో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీంతో ఆ కష్టాలకు చెక్ పడనుంది. ఈ ఫీచర్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

New Feature In UPI:  గుడ్ న్యూస్ చెప్పిన RBI! UPIలో కొత్త ఫీచర్.. ఆ కష్టాలకు చెక్!

నేటి సమాజంలో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీంతో ఎన్నో సేవలను క్షణాల్లో వాటిద్వారా చేసుకుంటున్నారు. ఇక మనీ ట్రాన్స్ ఫర్ కోసం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) యాప్స్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. కస్టమర్ల నుంచి వస్తున్న విశేష స్పందనతో.. వారి సౌలభ్యం కోసం ఆర్బీఐ మరిన్ని కొత్త సేవలను యూపీఐ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూపీఐలో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీంతో ఆ కష్టాలకు చెక్ పడనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఆర్బీఐ మానీటరీ పాలసీ కమిటి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను శుక్రవారం ప్రకటించారు. అందులో భాగంగా యూపీఐలో కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటంటే? యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్ మెషిన్ లో క్యాష్ డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు యూపీఐ ద్వారా ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా కు మంచి స్పందన లభిస్తున్న క్రమంలో.. ఆ ఆదరణ చూసి ఈ కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.

A new feature in UPI

కాగా ప్రస్తుతం డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే క్యాష్ డిపాజిట్ చేసే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి నుంచి యూపీఐ ద్వారా కూడా క్యాష్ ను మెషిన్లలో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే.. ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కాగా.. ఈ నయా ఫీచర్ తీసుకొస్తే.. కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు పొందడం మరింత ఈజీ అవుతుంది. బ్యాంకుల్లో క్యూ లైన్లలో వేచి ఉండే కష్టాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. దీంతో పాటుగా బ్యాంకులపై క్యాష్ నిర్వాహణ భారం తగ్గుతుంది. మరి ఆర్బీఐ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి