iDreamPost
android-app
ios-app

జర భద్రం: హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు!

జర భద్రం: హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు!

వర్షా కాలం మొదలైతే చాలు దోమల బెడద అన్ని ప్రాంతాల్ని పట్టి పీడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్‌ సిటీలకు దోమల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తగా లేకపోతే దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఇక, హైదరాబాద్‌ను డెంగ్యూ భయం పట్టి పీడుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 250 కేసులు నమోదయ్యాయి. ఉన్నత అధికారులకు కూడా డెంగ్యూ ముప్పు తప్పటం లేదు. ఈసీఐఎల్‌లో ఓ అధికారికి 3 రోజుల క్రితం జ్వరం వచ్చింది. 3 రోజులైనా ఆ జ్వరం తగ్గలేదు.

దీంతో ఆయన టెస్టులు చేయించుకున్నారు. ఆ టెస్టులో ఆయనకు డెంగ్యూ వచ్చినట్లు తేలింది. ప్లేట్‌లెట్లు 24 వేలకు పడిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వచ్చే కేసుల్లో 20లో దాదాపు 5 వరకు డెంగ్యూ పాజిటివ్‌ కేసులు ఉంటున్నాయని వైదులు తెలియజేస్తున్నారు. నిల్వ ఉంచిన నీటి కారణంగానే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ప్రతీ ఒక్కరు పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలని అంటున్నారు. కాగా, ఏపీలోనూ డెంగ్యూ, మలేరియా కేసులు విపరీతంగా ఉన్నాయి.

జులై నెల వరకు దాదాపు 2,329 కేసులు నమోదయ్యాయి. కేవలం డెంగ్యూ కేసులు మాత్రమే కాదు.. మలేరియా కేసులు కూడా పెరిగాయి. దాదాపు 1,630 మలేరియా కేసులు నమోదయ్యాయి. గతంలో ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ వీ.రామిరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. వార్షాకాల కావటంతో దోమల బెడద పెరిగిందని, తద్వారా డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. మరి, హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.