iDreamPost
android-app
ios-app

కాలేజీలో వింత సెలబ్రేషన్స్.. లంగా, జాకెట్లు వేసుకున్న ప్రొఫెసర్లు! ఎక్కడంటే?

  • Published May 24, 2024 | 4:48 PMUpdated May 24, 2024 | 4:48 PM

ప్రస్తుతం ఈ సొసైటీలో ఉన్న పరిస్థితులపై అవరేర్‌నెస్‌ కల్పించడం కొందరు ప్రొఫెసర్లు కాస్త వెరైటీగా ఫ్యాషన్ షో  నిర్వహించారు. ఈ క్రమంలోనే మగవాళ్లు చీరలు, ఘాగ్రా చోళీ, పంజాబీ డ్రెస్, హాఫ్ సారీతో, లేడీ ప్రొఫెసర్లు టీచర్లు షర్ట్, ప్యాంటు, షర్ట్ లో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఇంతకి ఎక్కడంటే

ప్రస్తుతం ఈ సొసైటీలో ఉన్న పరిస్థితులపై అవరేర్‌నెస్‌ కల్పించడం కొందరు ప్రొఫెసర్లు కాస్త వెరైటీగా ఫ్యాషన్ షో  నిర్వహించారు. ఈ క్రమంలోనే మగవాళ్లు చీరలు, ఘాగ్రా చోళీ, పంజాబీ డ్రెస్, హాఫ్ సారీతో, లేడీ ప్రొఫెసర్లు టీచర్లు షర్ట్, ప్యాంటు, షర్ట్ లో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఇంతకి ఎక్కడంటే

  • Published May 24, 2024 | 4:48 PMUpdated May 24, 2024 | 4:48 PM
కాలేజీలో వింత సెలబ్రేషన్స్.. లంగా, జాకెట్లు వేసుకున్న ప్రొఫెసర్లు! ఎక్కడంటే?

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదైనది.  ముఖ్యంగా ప్రతిఒక్క విద్యార్థికి దశలో ఉపాధ‍్యాయుని పాత్ర కీలకమైనది. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ సొసైటీలో ఉన్న పరిస్థితులపై అవరేర్‌నెస్‌ కల్పించడంలో  తల్లిదండ్రుల కన్నా.. ఉపాధ్యాయులు ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా.. విద్యార్థులకు  మంచి చెడులు చెప్పడానికి  ఏమాత్రం వెనకాడరనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ యూనివర్సిటిలో కొందరు ప్రొఫెసర్లు అవరేర్‌నెస్‌ కల్పించడం కోసం  కాస్త వెరైటీగా ఫ్యాషన్ షో  నిర్వహించారు.  ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే ఢిల్లీ యూనివర్సిటిలో కొంతమంది ప్రొఫెసర్లు ఫ్యాషన్ షో నిర్వహించారు. కాగా, అక్కడ  మనం దరించే దుస్తులు ఎందుకు జండర్ ను తెలియజేయాలనేలా ఫ్యాషన్‌ షో నిర్వహించి అందరికీ చాటి చెప్పాలనుకున్నారు. ఈ క్రమంలోనే.. ప్రొఫెసర్లు అంతా కలిసి ఓ స్పెషల్‌  థీమ్‌ ఫ్యాషన్‌ షో చేశారు. అయితే అక్కడ జెంట్‌ జెంట్ ప్రొఫెసర్లు ఆడవారి వేషధరణలోనూ, లేడీ ప్రొఫెసర్లు మగవారి వేషధరణలో ర్యాంప్ వాక్ చేశారు. ఇక మగవారు చీరలు, ఘాగ్రా చోళీ, పంజాబీ డ్రెస్, హాఫ్ సారీతో రాగా.. లేడీ ప్రొఫెసర్లు టీచర్లు షర్ట్, ప్యాంటు, షర్ట్ లో వచ్చారు. ఇలా దాదాపు 10మంది యూనివర్సిటీ అధ్యాపకులు ఈ ర్యాంపు వాక్ లో పాల్గొన్నారు. కాగా, వారిలో కొందరు జోడీగా, కొందరు సోలోగా ఫర్మామెన్స్ చేశారు.

అయితే వారు ఈ ఫ్యాషన్‌ షోలో ఇలా ప్రదర్శన చేయడానికి కారణం.. అనాదిగా మూస పద్ధతులకు స్వస్తి చెప్పాలని ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫ్యాషన్ షో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసినవారంతా రకరకాలుగా మీమ్స్, కాంమెట్స్‌ చేస్తున్దనారు. అంతేకాకుండా ఈ ఫ్యాషన్‌ షో వీడియోను షేర్‌ చేస్తూ తెగ వైరల్‌ చేస్తున్నారు.  ఇకపోతే కొన్ని కాలేజిల్లో, స్కూల్‌ లో విద్యార్థులతో ఇలాంటి కార్యక్రమాలు చేయిపిస్తారు.కానీ, ఇక్కడ అధ్యాపకులే ఇలా చేసి అందర్ని ఆశ్చర్యపరచడం గమన్హారం.  ఇక కొందరు మాత్రం ఆ ప్రొఫెసర్ల పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. విద్యార్థులకే కాకుండా.. మరో పదిమందికి అవర్‌నెస్‌ కల్పించడం కోసం ప్రొఫెసర్లు ఇలా చేయడం నిజంగా గొప్ప విన్నూత కార్యక్రమం అంటూ ప్రశంసిస్తున్నారు. మరి, సమాజంలో అవరేర్‌నెస్‌ కల్పించడం కోసం ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు ఇలా ఫ్యాషన్‌ షో చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి