iDreamPost
android-app
ios-app

రష్మీక ఫేక్ వీడియో కేసులో కీలక మలుపు! యువకుడిని విచారించిన పోలీసులు

  • Author Soma Sekhar Published - 03:16 PM, Wed - 15 November 23

రష్మీక మందన్నా డీప్ ఫేక్ వీడియో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు విచారించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

రష్మీక మందన్నా డీప్ ఫేక్ వీడియో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు విచారించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Published - 03:16 PM, Wed - 15 November 23
రష్మీక ఫేక్ వీడియో కేసులో కీలక మలుపు! యువకుడిని విచారించిన పోలీసులు

నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీతో పాటుగా అదే స్థాయిలో సైబర్ దాడులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన AI టెక్నాలజీ మానవాళికే సవాల్ విసురుతోంది. మంచికి ఉపయోగించాలని దీనిని కనిపెడితే.. కొంతమంది మాత్రం దాన్ని చెడుకు ఉపయోగిస్తూ ఇతరులను సమస్యల్లోకి నెట్టేస్తున్నారు. తాజాగా ఈ ఏఐ టెక్నాలజీతో స్టార్ హీరోయిన్ రష్మీక మందన్నా ఫేక్ వీడియోను విడుదల చేసిన సంగతి తెసిందే. రష్మీక డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో, కేంద్రం ఈ సంఘటనపై సీరియస్ అయ్యింది. ఇక ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరోయిన్ రష్మీక మందన్నా డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో మనందరికి తెలిసిందే. ఈ ఘటనను సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు కూడా. ఇక రష్మీక ఫేక్ వీడియో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరకుండా తగిన చర్యలు తీసుకుంటూ పలు నిబంధనలు కూడా తెచ్చింది. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన 36 గంటల్లోగా దానిని తొలగించాలని, ఇలాంటి కేసులకు సంబంధించి ఓ సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి బీహార్ కు చెందిన 19 సంవత్సరాల యువకుడిని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యువకుడు రష్మీక డీప్ ఫేక్ వీడియోను ఫస్ట్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అప్ లోడ్ చేసి.. ఆతర్వాత దానిని మిగతా ప్లాట్ ఫారమ్స్ లో ఎక్కువగా షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడి సోషల్ మీడియా అకౌంట్ నుంచే తొలుత వీడియో అప్లోడ్ చేసినందుకు పోలీసులు అతడికి నోటీసులు ఇచ్చారు. అయితే రష్మీక వీడియోను తాను ఓ ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్ లోడ్ చేసినట్లుగా బీహార్ కు చెందిన యువకుడు చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు.