iDreamPost

రికార్డు స్థాయిలో ఎండలు.. అక్కడ ఏకంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!

Record Sunshine: దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయంటే.. ఎండ ప్రతాపం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.

Record Sunshine: దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయంటే.. ఎండ ప్రతాపం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.

రికార్డు స్థాయిలో ఎండలు.. అక్కడ ఏకంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!

దేశంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో ఎండలు దంచికొడితే కొన్ని ప్రాంతాలు వర్షాలు ముంచేస్తున్నాయి. దేశంలో మార్చి నెల నుంచి ఎండలు ముదిరిపోయాయి. ఏప్రిల్, మే నెలలో భానుడి ప్రతాపం తట్టుకోలేని పరిస్థితి చేరుకుంది. కొన్ని రాష్ట్రాలో ఎండలు ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరుకుంది. ఎండలు భరించలేక జనాలు బయటకు రావాలంటే భయపడే పరిస్తితి నెలకొంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు చల్లని పానియాల వెంట పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేశంలో 52.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రల నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే..

ఎండలు మండిపోతున్నాయి.. సూర్య ప్రతాపానికి ప్రజలు విల విలాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ రోజు రికార్డు స్థాయిలో తొలిసారిగా నగరంలోని మంగేష్ పూర్ లో ఏకంగా 52.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏడారి ప్రాంతమైన రాజస్థాన్ కన్నా ఎక్కువగా రాజధాని లో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్ లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్ర రికార్డు అయ్యింది. ఎండలతో ఢిల్లీలోని విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఇక్కడ 8,302 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఢిల్లీలోని నజాఫ్ గడ్, పిఠంపుర సహా మరికొన్ని ప్రాంతాల్లో నేడు 50 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో జనాలు ఏసీ, కూలర్లు వాడకం ఎక్కువ అయ్యింది. దీంతో మార్కెట్లో ఏసీ, కూలర్లు, ఫ్యాన్లకు డిమాండ్ పెరిగిపోయింది. భారత వాతావరణ శాఖ బుధవారం దేశంలోని వాయువ్య ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో ని పలు ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని.. వేడి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వేసవి కాలం వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని.. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారుల అంటున్నారు. పిల్లలు, గర్బిణీలు, వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ముంగేష్‌పూర్ లో బుధవారం 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుపై ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహపాత్ర స్పందించారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కొలిచేందుకు 20 చోట్ల మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని.. అందులో ముంగేష్‌పూర్ లో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు చూపించిందన్నారు. ఇంత ఉష్ణోగ్రత ఎప్పుడూ నమోదు కాలేదు. మిగతా వాటితో పోల్చితే ముంగేష్ పూర్ లో నమోదు అయిన డేటా భిన్నంగా ఉందన్నారు. దీనిని ధృవీకరించాల్సిన అవసరం లేదు అన్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, ఆ సెన్సార్ ను పరిశీలిస్తున్నారని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి