iDreamPost
android-app
ios-app

అతడితో పరిచయమే ఆమె పాలిట శాపమయ్యిందా?

  • Published Jul 28, 2023 | 1:05 PM Updated Updated Jul 28, 2023 | 1:05 PM
  • Published Jul 28, 2023 | 1:05 PMUpdated Jul 28, 2023 | 1:05 PM
అతడితో పరిచయమే ఆమె పాలిట శాపమయ్యిందా?

కొన్ని నేరాలను చూస్తే.. అమ్మో పక్కవారితో మాట్లాడటం కూడా పాపమే అనిపిస్తుంది. నేర ప్రవృత్తి పెరుగుతున్న ఈ రోజుల్లో.. ఎవరి మీద ఎవరు ఎప్పుడు ఎందుకు దాడి చేస్తున్నారో.. దారుణాలకు పాల్పడుతున్నారో అంచనా వేయడం కష్టం అవుతోంది. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగిస్తున్నారు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగు చూసింది. ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న ఓ వ్యక్తి.. ఓ రోజు సడెన్‌గా బాధితురాలి ఇంటికి వచ్చి.. ఆమెను పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చి హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగింది.. ఎందుకు అతడు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దారుణ సంఘటన ఢిల్లీ, డబ్రీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. నిందితుడిని 23 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు రేణు గోయల్‌ తన భర్త, పిల్లలతో కలిసి డబ్రీ ప్రాంతంలో నివసిస్తోంది. నిందితుడు ఆశీష్‌ కూడా అదే ప్రాంతంలో ఉండేవాడు. ఇక వీరిద్దరూ కలిసి ఒకే జిమ్‌కు వెళ్తుండేవారు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆశిష్‌ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి రేణు ఇంటికి వెళ్లాడు ఆశిష్‌. ఆమె ఇంటి ముందు పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో.. రేణును కాల్చి.. అ‍క్కడ నుంచి పరారయ్యాడు. రేణు మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రేణుని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించసాగారు. ఇక రేణు నివాసం దగ్గర ఉన్న సీసీటీవీ గమనించగా.. ఆశిష్‌ దారుణానికి పాల్పడ్డట్లు తెలిసింది. అతడిని అరెస్ట్‌ చేయడానికి ఆశిష్‌ ఇంటికి వెళ్లిన పోలీసులకు అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. నాటు తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు ఆశిష్‌. ఇద్దరికి ఏళ్ల నుంచి పరిచయం ఉండటంతో.. వ్యక్తిగత కారణాల వల్లే ఈ దారుణం చోటు చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/