Nidhan
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కొత్త అవతారం ఎత్తాడు. దాని గురించి తెలిస్తే ప్రత్యర్థులు జడుసుకోవాల్సిందే. మరి.. పంత్ కొత్త అవతారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కొత్త అవతారం ఎత్తాడు. దాని గురించి తెలిస్తే ప్రత్యర్థులు జడుసుకోవాల్సిందే. మరి.. పంత్ కొత్త అవతారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్-2024లో అదరగొడుతున్నాడు. టీమ్ గెలుపోటముల సంగతి పక్కనబెడితే బ్యాట్స్‌మన్‌గా మాత్రం పంత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటిదాకా ఆడిన 12 మ్యాచుల్లో 156 స్ట్రైక్ రేట్‌తో 413 పరుగులు చేశాడతను. మిడిల్ ఓవర్లలో క్రీజులోకి వస్తున్న పంత్.. ఇన్నింగ్స్ ఆఖరి వరకు నిలబడి టీమ్‌కు భారీ స్కోర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన డీసీ కెప్టెన్.. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉంటూ స్టంపింగ్స్, రనౌట్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అలాంటోడు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. దాని గురించి తెలుసుకుందాం..
పంత్ బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ చేస్తాడనేది తెలిసిందే. వికెట్ల వెనుక పాదరసంలా కదులుతూ క్యాచులు పట్టడం, రనౌట్లు, స్టంపౌట్లు చేయడంలో అతడు ఆరితేరాడు. బ్యాట్ పట్టుకున్నాడా బౌలర్ ఎవరనేది చూడకుండా పిచ్చకొట్టుడు కొట్టడం అతడికి అలవాటుగా మారింది. అలాంటోడు ఇప్పుడు బౌలర్ అవతారం ఎత్తాడు. తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో ఆదివారం తలపడనుంది డీసీ. ఈ నేపథ్యంలో జోరుగా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు ఆ టీమ్ ప్లేయర్లు. పంత్ కూడా నెట్స్‌లో చెమటలు చిందించాడు. అలాగే సరదాగా బౌలర్ అవతారం ఎత్తి.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ను ఇమిటేట్ చేశాడు. అచ్చం పఠాన్ బౌలింగ్ యాక్షన్‌ను దింపేశాడు.
పఠాన్ బౌలింగ్ వేసేటప్పుడు ఎలాగైతే జంప్ చేస్తాడో అలా దూకుతూ ఎడమ చేతిని ముందుకు తీసుకొస్తూ బౌలింగ్ చేశాడు పంత్. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అతడిలాగే ఉండేలా చూసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. సరదాగానే చేశాడా? లేదా నిజంగానే పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడా? అని అంటున్నారు. ఒకవేళ అతడు బౌలర్‌గా మారితే ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ అని చెబుతున్నారు. ఇప్పటికే కీపింగ్, బ్యాటింగ్‌తో వణికిస్తున్న పంత్.. ఇంక బౌలర్‌గానూ మారితేనే అపోజిషన్ టీమ్స్ ఫినిష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, 12 మ్యాచుల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్న డీసీ.. ప్లేఆఫ్స్ చేరాలంటే నెక్స్ట్ రెండు గేమ్స్‌లో పక్కాగా గెలవాలి.