iDreamPost

వీడియో: WPL 2024.. ఫైనల్లో ఓటమి! గ్రౌండ్ లోనే వెక్కివెక్కి ఏడ్చిన కెప్టెన్!

WPL 2024 ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో టైటిల్ ను ఎగరేసుకుపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ టీమ్. దీంతో ట్రోఫీని ముద్దాడాలన్న కల రెండోసారి కూడా నెరవేరకపోవడంతో.. కన్నీటి పర్యంతమైంది ఢిల్లీ కెప్టెన్.

WPL 2024 ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో టైటిల్ ను ఎగరేసుకుపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ టీమ్. దీంతో ట్రోఫీని ముద్దాడాలన్న కల రెండోసారి కూడా నెరవేరకపోవడంతో.. కన్నీటి పర్యంతమైంది ఢిల్లీ కెప్టెన్.

వీడియో: WPL 2024.. ఫైనల్లో ఓటమి! గ్రౌండ్ లోనే వెక్కివెక్కి ఏడ్చిన కెప్టెన్!

మెగాటోర్నీలకు సంబంధించి టైటిళ్లను ముద్దాడాలని ప్రతీ ఒక్క కెప్టెన్ కు, ప్లేయర్లకు ఉంటుంది. అయితే ఈ కలను నెరవేర్చుకోవడం అందరి వల్ల కాదు. టోర్నీ మెుత్తం దుమ్మురేపిన జట్లు కొన్ని కొన్ని సార్లు ఫైనల్ మ్యాచ్ ల్లో బోల్తాపడుతూ ఉంటాయి. తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇదే జరిగింది. WPL ట్రోఫీని తొలిసారి ముద్దాడాలని కలలు గన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టీమ్ కు ఈసారి కూడా భంగపాటే ఎదురైంది. లీగ్ దశలో అద్భుతమైన ఆటతో అలరించిన ఈ టీమ్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో కంగుతిన్నది. దీంతో ఈ ఓటమిని తట్టుకోలేక ఢిల్లీ కెప్టెన్ గ్రౌండ్ లోనే వెక్కివెక్కి ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లను ముగించుకుంది. ఇక గడచిన ఈ రెండు ఎడిషన్లలో రెండు సార్లు ఫైనల్ కు చేరింది ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు. కానీ ఈ రెండు సందర్భాల్లో నిరాశే ఎదురైంది. తొలి సీజన్ లో ముంబై చేతిలో దెబ్బతింటే.. ఈసారి ఆర్సీబీ షాకిచ్చి, టైటిల్ ఎగరేసుకుపోయింది. 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. దీంతో మరోసారి టైటిల్ చేజారిపోవడంతో, ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. గ్రౌండ్ లోనే వెక్కివెక్కి ఏడ్చింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపడానికి తన కర్చీఫ్ ను అడ్డుపెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Defeat in the final! The captain cried on the ground!

ఇక ఈ వీడియోలో మెగ్ లానింగ్ కన్నీరు పెట్టుకోవడం చూసిన సగటు క్రికెట్ ఫ్యాన్స్ ఆమెకు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. మీరు ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. లీగ్ మెుత్తం అద్భుతంగా ఆడారు అంటూ ప్రశంసిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సైతం ఆమెకు అండగా నిలబడుతూ.. ఎప్పటికీ నువ్వు మా క్వీన్ వే అంటూ లానింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ టోర్నీలో లానింగ్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. 9 మ్యాచ్ ల్లో 331 పరుగులు చేసి లీడ్ స్కోరర్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇటు బ్యాటర్ గా, అటు కెప్టెన్ గా ఢిల్లీని ముందుండి నడిపింది ఈ ఆసీస్ క్రికెటర్.

ఇదికూడా చదవండి: ఆర్సీబీ విజయాల వెనుక కోహ్లీ.. అతడు చెప్పిన ఆ ఒక్క మాటతో..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి