iDreamPost

ఆర్సీబీ విజయాల వెనుక కోహ్లీ.. అతడు చెప్పిన ఆ ఒక్క మాటతో..!

  • Published Mar 18, 2024 | 12:08 PMUpdated Mar 18, 2024 | 12:08 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టిన ఆ టీమ్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్​ టైటిల్​ను సొంతం చేసుకుంది. అయితే స్మృతి సేన విజయాల వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టిన ఆ టీమ్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్​ టైటిల్​ను సొంతం చేసుకుంది. అయితే స్మృతి సేన విజయాల వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు.

  • Published Mar 18, 2024 | 12:08 PMUpdated Mar 18, 2024 | 12:08 PM
ఆర్సీబీ విజయాల వెనుక కోహ్లీ.. అతడు చెప్పిన ఆ ఒక్క మాటతో..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తానికి అనుకున్నది సాధించింది. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టిన స్మృతి సేన విమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్​తో ఆదివారం జరిగిన ఫైనల్​లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లు శ్రేయాంకా పాటిల్ (4/12), సోఫియా మొలిన్యూక్స్ (3/20), శోభనా ఆశా (2/14) దెబ్బకు ఢిల్లీ బ్యాటింగ్ యూనిట్ కకావికలమైంది. ఆ తర్వాత బ్యాటింగ్​ స్టార్ట్ చేసిన బెంగళూరు మరో 3 బంతులు ఉండగానే ఛేజ్ చేసి విక్టరీ కొట్టింది. కెప్టెన్ స్మృతి (31)తో పాటు సోఫీ డివైన్ (32), ఎలిస్ పెర్రీ (35 నాటౌట్) రాణించారు. అయితే ఆర్సీబీ వరుస విజయాలు సాధించడం, కప్ కొట్టడం వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు.

ఆర్సీబీ పురుషుల టీమ్ మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ విమెన్స్ టీమ్​ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. గతేడాది స్మృతి సేన దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. పాయింట్స్ టేబుల్​లో అట్టడుగున నిలిచింది. దీంతో వాళ్లు చాలా బాధపడ్డారు. ఇక, గెలవలేమని నిరాశలో కూరుకుపోయారు. అయితే ఆ టైమ్​లో తనతో కోహ్లీ మాట్లాడాడని స్మృతి మంధాన బయటపెట్టింది. అతడు తమ టీమ్ క్యాంప్​కు వచ్చాడని తెలిపింది. విరాట్ తప్పకుండా గెలుస్తామంటూ ఒకే మాట చెప్పి తమలో ధీమాను పెంచాడని గుర్తుచేసుకుంది. ‘నాకు ఇంకా గుర్తుంది. గత డబ్ల్యూపీఎల్ సీజన్​లో మా టీమ్ వరుస ఓటములతో డీలా పడిపోయింది. ఆ సమయంలో విరాట్ భయ్యా మా క్యాంప్​కు వచ్చాడు. మాతో కొద్దిసేపు డిస్కస్ చేశాడు. గెలుస్తామనే ధీమాను ఇచ్చాడు. అది నాకు పర్సనల్​గా చాలా హెల్ప్ అయింది. అలాగే మొత్తం టీమ్​లో కూడా అతడు జోష్​ను నింపాడు’ అని స్మృతి రివీల్ చేసింది.

ఆర్సీబీ విమెన్స్ టీమ్​తో కోహ్లీ జర్నీ అక్కడితో ఆగిపోలేదు. ఈ సారి కూడా అతడు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ అయిపోయిన వెంటనే వాళ్లకు కాల్ చేశాడు విరాట్. ఆ టైమ్​లో విమెన్స్ టీమ్ మొత్తం గెలిచిన సంతోషంలో ఉంది. ప్లేయర్లు అందరూ డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. కోహ్లీ ఫోన్​లో స్టెప్స్ వేస్తూ వాళ్లకు కంగ్రాట్స్ చెబుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని బట్టే స్మృతి సేన విజయాల వెనుక కింగ్ రోల్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మీరు సాధించగలరు, అనుకుంటే గెలవడం పెద్ద విషయం కాదు అంటూ వాళ్లను వెన్ను తట్టి కోహ్లీ ప్రోత్సహించడాడని చెప్పొచ్చు. స్మృతి మాటలు, టైటిల్ నెగ్గిన తర్వాత విరాట్ వాళ్లతో ఫోన్​లో మాట్లాడటమే దీనికి ప్రూఫ్. మరి.. ఆర్సీబీ విమెన్స్ టీమ్​ను కోహ్లీ వెనుక ఉండి నడపడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: RCB ఫ్యాన్స్.. 16 ఏళ్ల కల తీర్చిన దేవత ఎల్లీస్ పెర్రీ కథ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి