Somesekhar
ఆఫ్గానిస్తాన్ తో జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలం అయ్యాడు కెప్టెన్ రోహిత్. వరుసగా డకౌట్ల రూపంలో పెవిలిన్ కు చేరి.. ఫ్యాన్స్ కు అసంతృప్తిని మిగిల్చాడు. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ వైఫల్యానికి కారణం ఏంటని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. మరి ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫ్గానిస్తాన్ తో జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలం అయ్యాడు కెప్టెన్ రోహిత్. వరుసగా డకౌట్ల రూపంలో పెవిలిన్ కు చేరి.. ఫ్యాన్స్ కు అసంతృప్తిని మిగిల్చాడు. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ వైఫల్యానికి కారణం ఏంటని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. మరి ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
రోహిత్ శర్మ.. ఆఫ్గానిస్తాన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఎక్కువ టీ20 మ్యాచ్ లు గెలిచిన కెప్టెన్ గా దిగ్గజ క్రికెటర్ ధోని రికార్డును సమం చేయడమే కాక.. ఎక్కువ టీ20 సిరీస్ లు గెలిచిన సారథిగా రోహిత్ నిలిచాడు. దీంతో పాటుగా 100 టీ20లు గెలిచిన ప్లేయర్ గా, 150 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా హిట్ మ్యాన్ తన ఖాతాలో అరుదైన రికార్డులను వేసుకున్నాడు. ఇక్కడి వరకు సంతోషమే అయినా.. ఆందోళన కలిగించే విషయం మరోటి ఉంది. ఆఫ్గానిస్తాన్ తో జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలం అయ్యాడు కెప్టెన్ రోహిత్. వరుసగా డకౌట్ల రూపంలో పెవిలిన్ కు చేరి.. ఫ్యాన్స్ కు అసంతృప్తిని మిగిల్చాడు. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ వైఫల్యానికి కారణం అదేనా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి రోహిత్ వైఫల్యానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
0,0.. రోహిత్ గత రెండు మ్యాచ్ ల్లో చేసిన స్కోర్లు. 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ లను ఆశించారు ఫ్యాన్స్. కానీ వారి అంచనాలను తలకిందులు చేశాడు హిట్ మ్యాన్. ఆఫ్గాన్ తో జరిగిన తొలి టీ20లో దురదృష్టవశాత్తు రనౌట్ అవ్వగా.. రెండో మ్యాచ్ లో అద్భుతమైన బాల్ తో ఫారూఖీ బౌల్డ్ చేశాడు. దీంతో నిరాశగా వెనుదిరిగాడు రోహిత్. అయితే రోహిత్ శర్మ డకౌట్ల వెనుక ఉన్న కారణం ఏంటా? అని నెటిజన్లు తెగ ఆరాతీస్తున్నారు. పైగా సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల్లోనూ రోహిత్ పెద్దగా రాణించలేదు. దీంతో హిట్ మ్యాన్ వైఫల్యాల వెనక ఉన్న కారణం అదే అంటూ కొన్ని రీజన్స్ ను వెలుగెత్తి చూపుతున్నారు. మరి ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ 2023లో టీమిండియాను తన నాయకత్వంలో ముందుడి నడిపించాడు. జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు.. కానీ ట్రోఫీని అందివ్వడంలో విఫలం అయ్యాడు. ఫైనల్లో ఓడిపోయిన తర్వాత రోహిత్ చాలా బాధపడ్డాడు. ఇక ఇది జరిగిన కొద్ది రోజుల గ్యాప్ లోనే ముంబై ఇండియన్స్ తనను కెప్టెన్సీ నుంచి తీసేసింది. దీంతో రోహిత్ కు పెద్ద షాక్ తగిలింది. ఈ రెండు విషయాలు హిట్ మ్యాన్ ను తీవ్ర మానసిక వేధనకు గురిచేశాయి. మరీ ముఖ్యంగా ముంబై టీమ్ కెప్టెన్ గా తీసివేయడం, పాండ్యాకు పగ్గాలు అందివ్వడంతో రోహిత్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఈ రెండు సంఘటనల నుంచి బయటకి రావడానికి రోహిత్ కు కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఈ సమయంలోనే ప్రారంభమైన సౌతాఫ్రికా టూర్, ఆఫ్గాన్ టీ20 సిరీస్ లో రోహిత్ పెద్దగా రాణించకపోవడానికి కారణాలుగా నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. రోహిత్ ఇంకా ఈ సంఘటనల నుంచి పూర్తిగా బయటికిరాకపోవడమేనని ఈ వైఫల్యాలకు కారణమని వారి వాదన. దీంతో ఈ సంఘటనలను వీలైనంత త్వరగా మర్చిపోయి.. మళ్లీ పాత రోహిత్ ను చూడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి రోహిత్ వైఫల్యాలకు కారణం ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.