iDreamPost

క్రికెట్​కు స్టార్ ఆల్​రౌండర్ గుడ్​బై.. ఆ మ్యాచ్​లో అతడి ఆటను ఎవరూ మర్చిపోరు!

  • Published Jun 16, 2024 | 5:44 PMUpdated Jun 16, 2024 | 5:44 PM

క్రికెట్​కు ఓ స్టార్ ఆల్​రౌండర్ గుడ్​బై చెప్పేశాడు. రెండు దేశాల తరఫున ఆడుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడతను. అలాంటోడు ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించాడు.

క్రికెట్​కు ఓ స్టార్ ఆల్​రౌండర్ గుడ్​బై చెప్పేశాడు. రెండు దేశాల తరఫున ఆడుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడతను. అలాంటోడు ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించాడు.

  • Published Jun 16, 2024 | 5:44 PMUpdated Jun 16, 2024 | 5:44 PM
క్రికెట్​కు స్టార్ ఆల్​రౌండర్ గుడ్​బై.. ఆ మ్యాచ్​లో అతడి ఆటను ఎవరూ మర్చిపోరు!

క్రికెట్​లో ఎంతో మంది ఆటగాళ్లు వచ్చారు, పోయారు. కానీ కొంతమంది మాత్రమే అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అందరిలాగే వాళ్లు కూడా ఏదో ఒక రోజు గేమ్​కు గుడ్​బై చెప్పాల్సిందే. తాజాగా ఓ స్టార్ ఆల్​రౌండర్ ఇంటర్నేషనల్ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. నమీబియా ఆల్​రౌండర్ డేవిడ్ వీస్. 39 ఏళ్ల వీస్ బౌలర్​గానూ, బ్యాటర్​గానూ తన టాలెంట్​తో ఎంతో మంది ఆడియెన్స్ మనసుల్ని దోచుకున్నాడు. రెండు దేశాలకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. మొదట్లో సౌతాఫ్రికా తరఫున ఆడిన వీస్.. ఆ తర్వాత కొన్నాళ్లకు నమీబియాకు మారాడు.

2013లో సౌతాఫ్రికా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు వీస్. అదే జట్టుకు 2016 వరకు సేవలు అందించాడు. అనంతరం తన తండ్రి జన్మస్థలమైన నమీబియాకు అతడు వలస వెళ్లాడు. ఆ దేశ టీమ్​కు ఆడటం మొదలుపెట్టాడు. 2021 ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా నమీబియా తరఫునే ఆడుతూ వచ్చాడు. ఇప్పటివరకు నాలుగు ప్రపంచ కప్​లు ఆడాడతను. 2016లో ప్రొటీస్ టీమ్ తరఫున పొట్టి కప్పు బరిలో దిగిన వీస్.. 2021, 2022, 2024 ఎడిషన్స్​లో నమీబియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. తన ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో ఎన్నో మ్యాచ్​ల్లో జట్టుకు విజయాలు అందించాడు. రైటార్మ్ మీడియం పేసర్ అయిన అతడు 11 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్​లో 15 వన్డేలు, 51 టీ20 మ్యాచ్​లు ఆడాడు.

ఓవరాల్​గా అంతర్జాతీయ క్రికెట్​లో 73 వికెట్లు పడగొట్టిన వీస్..  సుమారుగా 1,000 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కెరీర్​తో పోలిస్తే ఫస్ట్ క్లాస్, లిస్ట్​-ఏ క్రికెట్​లో అతడికి ఘనమైన రికార్డులు ఉన్నాయి. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్​లు, 162 లిస్ట్-ఏ మ్యాచుల్లో కలిపి దాదాపుగా 10 వేల పరుగులు చేశాడతను. అందులో 13 సెంచరీలతో పాటు 54 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో ఏకంగా 490 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లోనూ పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు వీస్. అతడి పేరు చెప్పగానే టీ20 ప్రపంచ కప్-2021లో నెదర్లాండ్స్​పై గెలుపే గుర్తుకొస్తుంది. ఆ మ్యాచ్​లో బౌలింగ్​లో 1 వికెట్ తీసిన వీస్.. బ్యాటింగ్​లో 40 బంతుల్లో 66 పరుగులతో నాటౌట్​గా నిలిచి టీమ్​ను విజయతీరాలకు చేర్చాడు. ఐసీసీ టోర్నీల్లో నమీబియాకు అదే తొలి గెలుపు కావడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి