iDreamPost

ఈ కుక్కలు యమా డేంజర్.. ఈ 23 జాతుల కుక్క‌పై కేంద్రం నిషేదం

Danger with These Dogs: పెంపుడు జంతువుల్లో ఎంతో విశ్వాసం కలది శునకం. చాలా మంది ఇంట్లో రక రకాల జాతులకు సంబంధించిన కుక్కలను పెంచుకుంటారు.

Danger with These Dogs: పెంపుడు జంతువుల్లో ఎంతో విశ్వాసం కలది శునకం. చాలా మంది ఇంట్లో రక రకాల జాతులకు సంబంధించిన కుక్కలను పెంచుకుంటారు.

ఈ కుక్కలు యమా డేంజర్.. ఈ 23 జాతుల కుక్క‌పై కేంద్రం నిషేదం

అనాధిగా మనుషులకు, సాధు జంతువులకు అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి వాటిలో కుక్కలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. కుక్కలు యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. రాత్రీ, పగలు ఇంటికి కాపలా కాస్తుంటాయి. యజమాని కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్దపడతాయి. కొన్ని శునకాలు రక్షణ శాఖలో ఎంతో చురుకుగా పనిచేస్తుంటాయి. వాసన పసికట్టి నేరస్తులను పట్టిస్తుంటాయి. ఇదంతా ఒక ఎత్తైతే.. కొన్ని కుక్కలు మాత్రం మనుషులకు ప్రాణగండంగా మారాయి. ఇటీవల కుక్కల దాడుల్లో లక్షల మంది గాయపడ్డారు.. వేల సంఖ్యలో మరణించారని వార్తలు వస్తున్నాయి. తాజాగా కొన్ని జాతి కుక్కల వల్ల ప్రమాదం ఉందని కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయని ఇంట్లో పెంచుకుంటాం. అయితే కొన్ని జాతుల కుక్కల వల్ల మనుషులకు ప్రమాదం పొంచి ఉందని కేంద్రం వెల్లడించింది. ఇటీవల కాలంలో పెంపుడు కుక్కల దాడుల్లో మనుషుల ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. పెంపుడు కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పిట్ బుల్, టెర్రీయర్, అెరికన్ బుల్ డాగ్, రాట్ వీలర్, మస్టిప్స్ వంటి 23 రకాల కుక్కల సంతానోత్పత్తిని, అమ్మకాలను వెంటనే నిషేదించాలని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు మార్చి 12న కేంద్ర పశుసంవర్ధక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంట్లో పెంచుకుంటున్న కొన్ని ఫెరోషియెస్ బ్రీడ్లకు చెందిన కుక్కలు కరవడం వల్ల మనుషులు మృత్యువాత పడుతున్నట్లు సిటిజన్ ఫోరమ్ ల నుంచి జంతు సంక్షేమ సంస్థలకు పలు ఫిర్యాదు అందాయి.

ఈ నేపథ్యంలో పశుసంవర్ధకశాఖ కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విచారణ జరిపి 23 బ్రీడ్స్ అంత్యంత ప్రమాదంగా గుర్తించాయి. ఈ క్రమంలోనే వాటి దిగుమతి, విక్రయం, బ్రీడింగ్ ను నిషేదించాలని సూచించింది. ఈ కుక్కలకు సంబంధించిన లైసెన్స్ జారీ చేయవొద్దని కేంద్రం ఆదేశించింది. అంతే కాదు నిషేదిత ప్రమాదకర జంతువుల పెంపకం, క్రూరత్వాన్ని నిరోధించే విషయకంలో డాగ్ బ్రీడింగ్, మార్కెటింగ్ విధానాలు 2017, పెట్ షాప్ విధానాలు 2018 ను స్థానిక సంస్థలతు, రాష్ట్ర జంతు సంరక్షణ బోర్డులు, విభాగాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే మనుషుల కేంద్రం తీసుకున్న ఈ చర్యను పెటా ఇండియా స్వాగతించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి