iDreamPost

అధిక రక్తపోటు వల్ల కలిగే నష్టాలు.. తగ్గాలంటే ఏం చేయాలి?

అధిక రక్తపోటు వల్ల కలిగే నష్టాలు.. తగ్గాలంటే ఏం చేయాలి?

మానవ శరీరంలో సాధారణంగా సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 90 నుండి 120, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 60 నుండి 80 గాను ఉండాలి. రక్తపోటు 130 /90 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని అధిక రక్తపోటు అంటారు. అధిక రక్తపోటు అనేది మనకు తెలియకుండా మన శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుంది. శరీరానికి సరిపడా నీరు లేనప్పుడు అధిక రక్తపోటు వస్తుంది. అధికరక్తపోటు వల్ల రక్తనాళాలు దెబ్బతినడం, గుండె సంబంధ సమస్యలు, పక్షవాతం, కిడ్నీ జబ్బులాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వయసుతో సంభంధం లేకుండా అందరి మీద రక్తపోటు అనేది ఒకేరకమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

కొన్నిసార్లు ఒత్తిడి వలన కూడా అధిక రక్తపోటు వస్తుంది. ఒత్తిడిని వెంటనే తగ్గించడానికి గట్టిగ శ్వాస తీసుకోని వదలాలి ఇలా 5 నిముషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆహారంలో ఉప్పు తగినంత ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కూడా అధిక రక్తపోటుని తగ్గించవచ్చు. ఎక్కువగా ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు తినడం వల్ల అధిక రక్తపోటుని కంట్రోల్ లో ఉంచొచ్చు.

డ్రింకింగ్, స్మోకింగ్ లాంటి అలవాట్లను మానేయాలి. అధిక రక్తపోటుని తొందరగా తగ్గించడానికి అన్నింటికంటే తేలికైన పని మనం తినే ఆహారంలో వేడి వేడి అన్నంలో పచ్చి వెల్లుల్లిని కలుపుకొని తినాలి. ఇది చాలా ఘాటుగా ఉంటుంది అయినా ఇది గనుక చేస్తే వారం రోజుల్లో హైబీపీ నార్మల్ స్టేజికి వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి