iDreamPost

సాఫ్ట్ వేర్ ఉద్యోగినే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా రూ. 4 లక్షలు

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ తెలివి మీరిపోతున్నారు. ఒక మోసంపై ప్రజలకు అవగాహన కలుగుతుంది అనుకునే లోపు మరో దారిని వెతుకున్నారు. నమ్మ బలికి ఆ తర్వాత ఎంచక్కా దోచేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసం బయటకు వచ్చింది.

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ తెలివి మీరిపోతున్నారు. ఒక మోసంపై ప్రజలకు అవగాహన కలుగుతుంది అనుకునే లోపు మరో దారిని వెతుకున్నారు. నమ్మ బలికి ఆ తర్వాత ఎంచక్కా దోచేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసం బయటకు వచ్చింది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగినే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా రూ. 4 లక్షలు

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సాంకేతిక ఎంత అభివృద్ధి చెందుతుందో.. ఆ టెక్నాలజీని వినియోగిస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. గతంలో బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం.. మీ ఏటీఎం ఎక్స్ పైరీ అవుతుంది.. ఓటీపీ చెప్పండి.. కొత్తది పంపిస్తాం అంటూ డబ్బులు కొల్లగొట్టారు. దీనిపై అవగాహన రావడంతో.. కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఫోన్లకు లింక్స్ పంపిస్తూ.. వాటిపై క్లిక్ చేయగానే.. వారి ఖాతాల్లో ఉన్న నగదును కాజేస్తున్నారు. ఇది చాలవన్నట్లు నేరుగా మార్కెట్‌లోకి చొరబడిపోయారు. నా ఫోనులో బ్యాలెన్స్ లేదు, చార్జీంగ్ లేదు, సిగ్నల్ లేదంటూ.. ఓ సారి ఫోన్ ఇస్తారా.. మా వాళ్లకు కాల్ చేస్తామంటూ మొబైల్ తీసుకుని.. కోడ్‍తో ఆ ఫోనుకు వస్తున్న ఓటీపీ చెబుతున్నారు. అలా వెళ్లగానే డబ్బులు ఖాతా నుండి మాయం అవుతున్నాయి.

ఇప్పుడు ఇటువంటి తరహా మోసమో ఒకటి వెలుగులోకి వచ్చింది. అదీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారిన పడి.. రూ. 4 లక్షలు పొగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలంలోని రంగాపురానికి చెందిన శ్రీనివాసరావు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడు వర్క్ ఫ్రం హోంలో ఉన్నాడు. ఇటీవల స్విచ్ కాయిన్స్ అనే సంస్థ పేరుతో అతడికి వాట్సాప్ లింక్ వచ్చింది. ఇది పార్ట్ టైం ఉద్యోగమని, ఇంట్లో ఉంటూ పని చేసుకోవచ్చునంటూ ప్రకటన రూపంలో కనిపించింది. కేవలం రేటింగ్స్ ఇస్తూ రెండు మూడు గంటల్లోనే ఆదాయాన్ని ఆర్జించవచ్చునంటూ పేర్కొన్నారు. ఇందులో చేరాలంటే వెయ్యి రూపాయలు కట్టాలని చెప్పడంతో అలానే చేశాడు.

తొలుత అతడికి కొంత డబ్బును జమ చేస్తూ నమ్మించే ప్రయత్నం చేశారు. డబ్బు వస్తుండే సరికి ఇదేదో జెన్యూన్ అని నమ్మాడు శ్రీనివాసరావు. వారు ఎంత కట్టమంటే అంత అందులో జమ చేస్తూ వచ్చాడు. రూ. 1.60 లక్షలు జమ చేయగా.. మీరు చేసిన పనికి రూ. 80 వేలు వచ్చిందని, మొత్తం రూ. 2.40 లక్షలు చెల్లిస్తే సొమ్మంతా ఒకేసారి తీసుకునే వీలుంటుందని చెప్పుకొచ్చారు సైబర్ నేరగాళ్లు. అలా పలు దఫాలుగా.. జమ చేయడం, ఆదాయం రావడంతో దాన్ని బలంగా నమ్మాడు. ఈ క్రమంలో రూ. 4, 03, 467లు ఆ సంస్థకు జమచేశాడు. అయితే ఎటువంటి రిప్లై రాకపోవడంతో మోసపోయానని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పార్ట్ టైం ఉద్యోగాలంటూ ఆఫర్లిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి