iDreamPost

దొంగగా మారిన లేడీ టెకీ.. జాబ్ పోవడంతో ఎంతకి తెగించిందంటే..?

  • Published Mar 29, 2024 | 5:01 PMUpdated Mar 29, 2024 | 5:01 PM

దొంగగా మారిందో లేడీ టెకీ. జాబ్ పోవడంతో బరితెగించిందా యువతి. వాటిని మాత్రమే టార్గెట్ చేస్తూ తన చేతివాటం చూపించింది.

దొంగగా మారిందో లేడీ టెకీ. జాబ్ పోవడంతో బరితెగించిందా యువతి. వాటిని మాత్రమే టార్గెట్ చేస్తూ తన చేతివాటం చూపించింది.

  • Published Mar 29, 2024 | 5:01 PMUpdated Mar 29, 2024 | 5:01 PM
దొంగగా మారిన లేడీ టెకీ.. జాబ్ పోవడంతో ఎంతకి తెగించిందంటే..?

ప్రస్తుత కాలంలో చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఐటీ జాబ్స్​కు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రైవేటు సెక్టార్​కు వెళ్లాలనుకునేవారు, సర్కారు నౌకరీ రాని వాళ్లు సాఫ్ట్​వేర్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. లక్షల్లో జీతాలు ఇస్తుండటంతో ఐటీ సెక్టార్​కు సూపర్ డిమాండ్ ఏర్పడింది. అందరు విద్యార్థుల్లాగే తానూ టెకీ అవ్వాలనుకుంది. కష్టపడి జాబ్ తెచ్చుకుంది. కొన్నాళ్ల పాటు ఉద్యోగం  చేసింది. కానీ కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయింది. దీంతో దొంగగా మారింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా తన చేతివాటం ప్రదర్శించింది. అయితే ఎట్టకేలకు ఆమెను పోలీసులు పట్టుకున్నారు. నోయిడాకు చెందిన 26 ఏళ్ల జాస్సీ అగర్వాల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జాస్సీ అగర్వాల్ ఉద్యోగం వెతుక్కుంటూ బెంగళూరుకు వచ్చింది. అక్కడ టెకీగా జాబ్ రావడంతో కొన్నాళ్లు వర్క్ చేసింది. అయితే కొవిడ్ టైమ్​లో ఆమె ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత దొంగ అవతారం ఎత్తిన జాస్సీ.. పీజీల నుంచి ల్యాప్​టాప్​లు, గాడ్జెట్​లను దొంగిలించడం స్టార్ట్ చేసింది. అలా ఎత్తుకొచ్చిన వాటిని తన స్వగ్రామంలో బ్లాక్ మార్కెట్​లో విక్రయిస్తూ ఫుల్ టైమ్​ థీఫ్​గా మారిపోయింది. ఖాళీగా ఉన్న పీజీ రూమ్స్​లోకి వెళ్లి ఛార్జింగ్ పెట్టిన ల్యాప్​టాప్​లు తస్కరించేది జాస్సీ. అయితే ల్యాప్​టాప్​లు, గాడ్జెట్స్ ఒక్కొక్కటిగా మాయమవుతుండటంతో కొందరు పోలీసులకు కంప్లయింట్ చేశారు. దీంతో జాస్సీ చేతివాటం బయటకు వచ్చింది.

జాస్సీని మార్చి 26వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి రూ.10 నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్​టాప్​లను స్వాధీనం చేసుకున్నారు. జాస్సీ చాలా ఏరియాల్లో దొంగతనాలు చేస్తోందని.. ఇది కొంతకాలంగా జరుగుతోందని పోలీసులు తెలిపారు. పీజీల్లోకి ప్రవేశించి ల్యాప్​టాప్​లు, గాడ్జెట్​లతో ఆమె తిరిగి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను క్రైమ్ బ్రాంచ్ భద్రపరిచిందని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. జాబ్ పోతే ఇంకో జాబ్ చూసుకోవాలని.. కానీ ఇలా దొంగతనాలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఎంత జాబ్ పోతే మాత్రం ఇంకొకరి సొమ్ము ఆశించడం సరికాదని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి