iDreamPost

బ్యాంకు మేనేజర్‌ కిడ్నాప్. 50 లక్షలు డిమాండ్.. చివర్లో పోకిరి మాదిరి ట్విస్ట్!

  • Published Apr 25, 2024 | 9:37 PMUpdated Apr 25, 2024 | 9:37 PM

సాధారణంగా బ్యాంకుల్లో ఉన్న డబ్బులను దోచేయడం  ఆ బ్యాంకులకే కన్నాలు వేస్తారు. కానీ,  బ్యాంకుల్లో పనిచేసే అధికారులను కిడ్నాప్ చేయాలని అనుకోరు. అయితే తాజాగా బ్యాంకులో డబ్బును దోచేయలనే ఆశతో ఓ ఇద్దరు భార్యభర్తులు ఏకంగా.. బ్యాంకు మేనేజర్ నే కిడ్నాప్ చేశారు. కానీ, చివరిలో ఊహించని ట్విస్ట్ జరిగింది.

సాధారణంగా బ్యాంకుల్లో ఉన్న డబ్బులను దోచేయడం  ఆ బ్యాంకులకే కన్నాలు వేస్తారు. కానీ,  బ్యాంకుల్లో పనిచేసే అధికారులను కిడ్నాప్ చేయాలని అనుకోరు. అయితే తాజాగా బ్యాంకులో డబ్బును దోచేయలనే ఆశతో ఓ ఇద్దరు భార్యభర్తులు ఏకంగా.. బ్యాంకు మేనేజర్ నే కిడ్నాప్ చేశారు. కానీ, చివరిలో ఊహించని ట్విస్ట్ జరిగింది.

  • Published Apr 25, 2024 | 9:37 PMUpdated Apr 25, 2024 | 9:37 PM
బ్యాంకు మేనేజర్‌ కిడ్నాప్. 50 లక్షలు డిమాండ్.. చివర్లో పోకిరి మాదిరి ట్విస్ట్!

ఇప్పటికే దేశంలో ఓ వైపు సైబర్ నేరాలు అనేవి పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కడ చూసిన బ్యాంకు దోపిడిలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. కాగా, ఈ బ్యాంకు దోపిడిల్లో సైబర్ క్రైమ్ లు కొన్ని అయితే, మరికొన్ని బ్యాంకు అధికారులే అవినీతికి పాల్పడుతూ.. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఇక మరి కొందరు అయితే నేరుగా బ్యాంకులకే కన్నాలు పెడుతూ లక్షల రూపాయాలను దోచేస్తున్నారు. ఇక ఇప్పుడైతే ఏకంగా కొత్త తరహా దోపిడిలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇద్దరి కిలాడీలు ఏకంగా బ్యాంకు మేనేజర్ నే కిడ్నాప్ చేసి లక్షలు కొలది నగదును ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధారణంగా బ్యాంకుల్లో ఉన్న డబ్బులను దోచేయడం  ఆ బ్యాంకులకే కన్నాలు వేస్తారు. కానీ,  బ్యాంకుల్లో పనిచేసే అధికారులను కిడ్నాప్ చేయాలని అనుకోరు. అయితే తాజాగా బ్యాంకులో డబ్బును దోచేయలనే ఆశతో ఓ ఇద్దరు భార్యభర్తులు ఏకంగా.. బ్యాంకు మేనేజర్ నే కిడ్నాప్ చేశారు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇది వినడానికి సినిమా కథలా ఉన్న నిజంగానే జరిగింది.  ఇంతకి ఎక్కడంటే.. ఢిల్లీలో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసే సతీష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఫరీదాబాద్‌లోని సెక్టార్ 62 లో నివసిస్తున్నాడు. అయితే అదే ప్రాంతంలో ఉండే భూపేంద్ర అనే వ్యక్తి ఎలాగైనా సతీష్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. అందుకు తన భార్య, మరో స్నేహితుడితో కలిసి పథకం వేశాడు.  ఈ క్రమంలోనే.. భూపేంద్ర అతని భార్య, స్నేహితుడితో కలిసి సతీష్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. కాగా, రాత్రిపూట సతీష్ ఇంటి మెయిన్ డోర్ మూసి ఉందని గమనించారు. అయితే చివరికి శనివారం అర్ధరాత్రి సతీష్ ఇంట్లోకి చొరబడ్డారు. అంతేకాకుండా.. సతీష్ తలపై తుపాకీ పెట్టి అతనిని బెదిరించారు. కాగా, ఆ సమయంలో సతీష్ స్నేహితుడు అమిత్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సుత్తెతో భూపేంద్ర దాడి చేశాడు. అనంతరం సతీష్ కారుతోపాటు పర్సు, అక్కడ ఉన్న వారి అందరి ఫోన్లు తీసుకుని అదే సతీష్ కారులోనే పరారయ్యారు.

ఇక  కారులోకి ఎక్కించిన సతీష్ కు ఆ తర్వాత కాళ్లు, చేతులు, నోరు కట్టేసి సీటు కింద కనపడకుండా చేశారు. ఇక కారులో డీజిల్ పోసేందుకు సతీష్ క్రెడిట్ కార్డునే నిందితులు ఉపయోగించారు. ఈ నేపథ్యంలోనే ఫరీదాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌కు చేరుకున్నారు. అయితే బిలాస్‌పూర్ చేరుకున్న తర్వాత భూపేంద్ర ఇతర కిడ్నాపర్లు.. సతీష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. కాగా, అప్పటికే సతీష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హర్యానా క్రైం బ్రాంచ్ పోలీసులు ఆరు స్పెషల్‌ టీమ్స్ రంగంలోకి దిగాయి. అయితే నిందితులను పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ అధికారులే వారితో మాట్లాడారు. చివరికి రూ.5 లక్షలు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఆ రూ.5 లక్షలను సతీష్ బ్యాంకు అకౌంట్లో వేయాలని నిందితులు డిమాండ్ చేశారు. కాగా, తమ దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో.. మొదట రూ.1 లక్ష అకౌంట్లో వేసి.. మిగితా రూ.4 లక్షలను డబ్బు రూపంలో ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే సతీష్ భార్య నుంచి డబ్బు తీసుకునేందుకు నిందితుడు భూపేంద్ర కేలి బైపాస్ వద్దకు చేరుకున్నాడు. ఇక క్యాబ్‌లో వచ్చి ఆమె దగ్గర ఉన్న డబ్బు తీసుకున్న తర్వాత.. మళ్లీ క్యాబ్ ఎక్కాడు. అయితే అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు భూపేంద్రను అరెస్ట్ చేశారు. అనంతరం అతడ్ని విచారణ చేయగా.. సతీష్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురకు తరలించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే భూపేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి మిగిలిన నిందితులు అంతా పరారయ్యారు. ఆ తర్వాత.. మథురలో కిడ్నాప్ అయి ఉన్న సతీష్‌ను పోలీసులు రక్షించారు. అయితే  బుల్లెట్ గాయాలతో ఉన్న సతీష్‌ను పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక  పరారీలో ఉన్న మిగిలిన  నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరి, డబ్బు కోసం ఆశపడి ఏకంగా బ్యాంకు మేనేజర్ నే కిడ్నాప్ చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి