iDreamPost

అందమైన భార్యను చూసి ఓర్వలేని భర్త.. షాప్ దగ్గరకు వెళ్లి

అందమైన భార్య. రెండు చేతులా సంపాదిస్తుంది కూడా. కానీ భర్త ఆమెకు వచ్చిన పేరును చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెపై అక్కసు పెంచుకున్నాడు. భార్యతో మాట్లాడేందుకు షాపు వద్దకు వెళ్లి..

అందమైన భార్య. రెండు చేతులా సంపాదిస్తుంది కూడా. కానీ భర్త ఆమెకు వచ్చిన పేరును చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెపై అక్కసు పెంచుకున్నాడు. భార్యతో మాట్లాడేందుకు షాపు వద్దకు వెళ్లి..

అందమైన భార్యను చూసి ఓర్వలేని భర్త.. షాప్ దగ్గరకు వెళ్లి

చాలా మందికి సోషల్ మీడియా ఆదాయ వనరుగా మారిపోయింది. అనామకులు సైతం సామాజిక మాధ్యమాల చలవ వల్ల.. సెలబ్రిటీలు అవుతున్నారు. యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్ వంటి యాప్స్ ద్వారా అటు నేమ్, ఫేమ్‌తో పాటు డబ్బును ఆర్జిస్తున్నారు. రీల్స్, షాట్స్ చేస్తూ.. ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయినవారున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు అటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూనే.. వీటిల్లో యాక్టివ్ అవుతూ.. వీడియోలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం కుటుంబ సభ్యులకు కొందరికి నచ్చడం లేదు. ముఖ్యంగా భార్యా భర్తల మధ్య గొడవలకు కారణమౌతున్నాయి. వారి కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఈ తరహా ఘటనలు ఇటీవల అనేకం చోటుచేసుకున్నాయి.

అందమైన భార్య, రెండు చేతులా సంపాదిస్తుంది కూడా. కానీ ఆమెకు వస్తున్న పేరును తట్టుకోలేకపోయాడు భర్త. అక్కసుతో భార్య, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కాల్చి చంపాడు భర్త. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఫలోడి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మహిరామ్, అనామికా బిష్ణోయ్‌ను భార్యా భర్తలు. అనామికా లేడీస్ కార్నర్ షాప్ నడుపుతూ  ఇన్‌స్టా‌గ్రామ్‌లో వీడియోలు చేసేది. ఈ  వీడియోలతో పాపులర్ కూడా అయ్యింది. ప్రస్తుతం ఆమెకు 1.1 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుండటం భర్త మహిరామ్‌కు నచ్చలేదు. ఈ విషయంపై వీరిద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో రెండుళ్లుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు.

సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటూ.. షాప్ రన్ చేసుకుంటూ.. ఒంటరిగా జీవిస్తోంది అనామికా. యధావిధిగా సోమవారం కూడా షాపుకు వెళ్లింది. అంతలోనే అక్కడకు వచ్చాడు భర్త. భార్యతో గొడవపడ్డాడు. ఆమెతో మాట్లాడుతుండగానే.. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుండి అనామికపై కాల్పులు జరిపాడు. ఆగ్రహంతో భార్యపై మూడు నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో.. ఆమె కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన అనామికను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహిరామ్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుందన్న కారణంతో ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి