iDreamPost

కన్నీళ్లు తెప్పించే ఘటన.. తల్లిదండ్రుల్ని కలిపేందుకు కూతురు ప్రయత్నం

పిల్లల ముందు భార్యా భర్తలు గొడవ పడి.. వారిని మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తున్నారు. కొన్ని సార్లు అయితే ఈ ఘర్షణల్లో వాళ్లను కూడా ఇన్వాల్ చేస్తున్నారు. దీంతో పిల్లలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక..

పిల్లల ముందు భార్యా భర్తలు గొడవ పడి.. వారిని మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తున్నారు. కొన్ని సార్లు అయితే ఈ ఘర్షణల్లో వాళ్లను కూడా ఇన్వాల్ చేస్తున్నారు. దీంతో పిల్లలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక..

కన్నీళ్లు తెప్పించే ఘటన.. తల్లిదండ్రుల్ని కలిపేందుకు కూతురు ప్రయత్నం

కుటుంబం అంటే.. అమ్మా నాన్న, పిల్లలు. చిన్న కుటుంబం.. చింత లేని కుటుంబంగా ఉంటే ఆ ఆనందమే వేరు. కానీ భార్యా భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి.. పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పిల్లల ముందు గొడవలు పడటం, బూతులు తిట్టుకోవడం, ఒకరినొకరు నిందించుకోవడం, వస్తువులు విసురుకోవడం, చేయి చేసుకోవడం వంటి పరిణామాలు వారి మానసిక పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. ఈ గొడవల మధ్యలో పిల్లలు వెళితే.. వారిపై కూడా దాడులు జరుగుతున్నాయి. శారీరకంగానూ బిడ్డలు హింసకు గురౌతున్నారు. దీంతో కొంత మంది అమ్మమ్మలు, నాన్నమ్మల దగ్గర పెరుగుతున్నారు. మరికొంత మంది చదువు పేరుతో దూరంగా ఉంటున్నారు.

కానీ తల్లిదండ్రులు కలిసి ఉంటే.. చూడాలనుకున్న ఈ అమ్మాయి.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో మనస్థాపానికి గురై చివరకు ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా పగిల్ల సైదులు, సంధ్యారాణిల పెద్ద కుమార్తె యోగిత బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాడుగుల పల్లి మండలం మాచినపల్లికి చెందిన యోగిత తల్లిదండ్రులు మనస్పర్థలు రావడంతో విడి విడిగా జీవిస్తున్నారు. సైదులు నల్లగొండలో సావర్కర్ నగర్‌లో నివాసముంటున్నాడు. సంధ్యారాణి గాంధీనగర్‌లో ఒంటరిగా నివాసముంటోంది. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది సంధ్య. వీరి కుమార్తె 22 ఏళ్ల యోగిత హైదరాబాద్‌లో పీజీ చేస్తోంది. అయితే తల్లిదండ్రులు విడిగా ఉండటంతో యోగిత వారిద్దరినీ కలిపేందుకు పలు విధాలుగా ప్రయత్నించింది.

ఎంతకు మొండి పట్టుదల వీడకపోవడంతో మనస్థాపానికి గురై.. గాంధీనగర్ లో అమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజే ఆమె తండ్రితో కలిసి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. మీరొచ్చేలోపు నేను తయారయ్యి ఉంటాను డాడీ అని చెప్పిన అమ్మాయి..తల్లికి ఈ విషయాన్ని కూడా చెప్పింది. అంతలో తల్లి ఇంటికి వచ్చి చూసే సరికి ఉరి కొయ్యకు వేళాడుతూ కనిపించింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి కూతురు చనిపోయిన విషయం చెప్పింది. సమీపంలో ఉన్న భర్త ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పడికే చనిపోయినట్లు నిర్దారించారు వైద్యులు. ఏం జరిగిందో, ఎందుకు ఇలా చేసిందోనని కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.

తాను చనిపోతే అయినా వారిద్దరు కలిసి ఉంటారని ఊహించిందో ఏమో.. తండ్రి శ్రీశైలం తీసుకెళదామనుకునే లోపు ఆమెను తరలిరానిలోకాలకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులను కలిపేందుకు ఏ కూతురు చేయని దుస్సాహం చేసింది యోగిత.  అయితే స్థానికులు తల్లిదండ్రుల కోసం ఆమె చనిపోవాలా..? కొన్ని రోజులు పోతే.. వాళ్లే కలిసిపోయేవారు కదా అని మాట్లాడుకుంటున్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి