iDreamPost

ఠాగూర్ సినిమా కన్నా దారుణం! 35 లక్షలు బిల్లు కట్టి డెడ్ బాడీని తీసుకెళ్లమని!

మరికొన్ని రోజుల్లో తన చేతుల్లోకి బుజ్జి పాపాయిలు రాబోతున్నారని సంబరపడిపోయింది ఇల్లాలు. అంతలో నెలలు నిండకుండానే నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. కానీ

మరికొన్ని రోజుల్లో తన చేతుల్లోకి బుజ్జి పాపాయిలు రాబోతున్నారని సంబరపడిపోయింది ఇల్లాలు. అంతలో నెలలు నిండకుండానే నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. కానీ

ఠాగూర్ సినిమా కన్నా దారుణం! 35 లక్షలు బిల్లు కట్టి డెడ్ బాడీని తీసుకెళ్లమని!

మాతృత్వం మహిళకు మాత్రమే దొరికిన అరుదైన వరం. పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. ఓ బిడ్డకు జన్మనివ్వాలని, చిన్నారితో అమ్మ అని పిలిపించుకోవాలని కోరుకుంటుంది. కాన్పు ఆడదానికి మరో జన్మ లాంటిది. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా కూడా కూడా బిడ్డను ప్రసవించేందుకు సాహస్తుంది. గోడ్రాలని అత్తమామలు, ఇరుగు పొరుగు సూటిపోటి మాటలు కన్నా.. ఓ బాబుకు లేదా పాపకు జన్మనివ్వాలని నిశ్చయించుకుంటుంది. బిడ్డ కడుపులో తన్నుతుంటే.. మైమరిచి, మురిసిపోతుంది. ఎప్పుడు తన చేతులతో బిడ్డను ఎత్తకుంటానా అని ఊవిళ్లూరుతుంది. కానీ ఆ మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించకుండానే ఓ తల్లి మరణించింది. అయితే డబ్బులు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పింది ప్రముఖ హాస్పిటల్. ఠాగూర్ తరహాలో జరిగింది ఈ ఘటన.

ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి.. ఆ బిడ్డల ముఖాన్ని కూడా సరిగ్గా చూడకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే ఇది వైద్యుల నిర్లక్ష్యమే అని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేశవ్, జనని భార్యా భర్తలు. వీళ్లు IVF విధానంలో పిల్లల్ని కనేందుకు క్లౌడ్‌నైన్ హాస్పిటల్‌కు వెళ్లారు. జనని గర్భం దాల్చింది. కవలలను అని తెలిసి.. సంబరపడిపోయింది ఆ కుటుంబం. మే 2న ఊహించిన విధంగా ఆమెకు ప్రసవ నొప్పులు రావడంతో ఆమె చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రిలో చేరింది. అయితే వెంటనే ఆమెకు డెలివరీ చేయగా.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆమెకు కామెర్లు, కాలేయం సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో అక్కడే చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం జనని మృతి చెందింది.

కాగా, మణిపాల్ ఆసుపత్రిలో రూ. 30 లక్షల బిల్లు వేసింది. ఈ బిల్లు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది తెలిపారు. అయితే భర్త క్లౌడ్‌నైన్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని ఆరోపిస్తున్నాడు. బిల్లును అదే ఆసుపత్రి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మృతురాలి భర్త కేశమ్ మాట్లాడుతూ.. ‘గత నెలలో పరీక్షకు వచ్చినప్పుడు డాక్టర్‌ కొన్ని మాత్రలు ఇచ్చారు. తరువాత, నా భార్యకు కాళ్ళ వాపుతో సహా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. నెలల నిండకుండానే మే 2వ తేదీ ఉదయం నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకు వచ్చాం. కవలలు జన్మించారు. నేను ఉదయం 11 గంటలకు నా భార్యతో మాట్లాడినప్పుడు, ఆమె బాగానే ఉంది. అకస్మాత్తుగా సీరియస్‌గా ఉందన్నారు డాక్టర్లు. అనంతరం మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చనిపోయింది. ఇప్పుడు డబ్బు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఆసుపత్రి చెబుతుంది.. 11 లక్షల విలువైన మందులు తెచ్చాను. 30 లక్షలు బిల్లు అయ్యింది.. ఈ బిల్లును క్లౌడ్‌నైన్ ఆస్పత్రి చెల్లించాల్సిందే’ అని డిమాండ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి