iDreamPost
android-app
ios-app

3 ఏళ్ల ప్రేమ, ఏడాది క్రితం పెళ్లి.. భర్తే సర్వస్వం అని నమ్మితే

వారిద్దరూ ప్రేమికులు. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కులాలు వేరు అయినప్పటికీ.. అతడి కోసం అవేమీ పట్టించుకోలేదు ప్రేయసి. అతడ్ని నమ్మి, అతడే సర్వస్వం అనుకుని..

వారిద్దరూ ప్రేమికులు. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కులాలు వేరు అయినప్పటికీ.. అతడి కోసం అవేమీ పట్టించుకోలేదు ప్రేయసి. అతడ్ని నమ్మి, అతడే సర్వస్వం అనుకుని..

3 ఏళ్ల ప్రేమ, ఏడాది క్రితం పెళ్లి.. భర్తే సర్వస్వం అని నమ్మితే

తల్లిదండ్రుల్ని కాదని, ప్రేమించిన యువకుడి కోసం ఎంతకు దూరమైనా వెళుతుంటారు కొంత మంది అమ్మాయిలు. తనను కని పెంచి విద్యా బుద్దులు నేర్పిన తల్లిదండ్రుల్ని వద్దనుకుని.. ప్రియుడి కోసం వచ్చేస్తుంటారు. అతడే సర్వస్వం అనే నమ్మకంతో కట్టుబట్టలలో అడుగులు బయటకు వేస్తారు. కానీ నమ్మిన వాడే నట్టేట ముంచేశాడని తెలిస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. ఇంత మందిని ఎదిరించి, పెళ్లి చేసుకుంటే, తన జీవితం ఇలా నవ్వులు పాలు అయ్యిందని కుమిలిపోతుంటారు. తనకే ఎందుకిలా అవుతుందన్న బాధలో మునిగిపోతుంటారు. అటు తల్లిదండ్రులు ఛీ కొట్టి.. ఇటు కట్టుకున్నవాడు వదిలేసి.. ఎటు పోవాలో, ఎవరి చెంత చేరాలో.. ఎలా మొహం తలెత్తుకోవాలో తెలియక.. చావే శరణ్యమని ఆశ్రయిస్తున్నారు చాలా మంది అమ్మాయిలు.

విశాలాక్షి విషయంలో కూడా ఇదే జరిగింది. ఎంతో ప్రాణంగా ప్రేమించిన యువకుడ్ని మనువాడాను అన్న సంతోషం ఆమెకు మిగల్లేదు. కాపురం ముణాళ్ల ముచ్చటగా మిగిలింది. భర్త తనను కాదని మరో వివాహం చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది విశాలాక్షి. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ వర్గానికి చెందిన విశాలాక్షి, ఎస్టీ కులానికి చెందిన తిప్పే స్వామి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో.. వారిని ఎదిరించి.. పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం ఏడాది పాటు సవ్యంగా సాగిపోయింది. అయితే విశాలాక్షికి తెలియకుండా.. గుట్టు చప్పుడు కాకుండా తిప్పేస్వామికి మరో యువతితో వివాహం చేశారు అతడి కుటుంబ సభ్యులు

నాలుగు రోజుల క్రితం విశాలాక్షి వాట్సప్‌కు ఆ పిక్ పంపాడు తిప్పేస్వామి. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న భార్య.. తాను మోసపోయానని తెలిసి ఆదివారం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విశాలాక్షిని నమ్మించి, ద్రోహం చేశాడని ఆమె తల్లిండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్నిపోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తిప్పేస్వామిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి