iDreamPost

ఈ దంపతులు మహా ముదుర్లు… ఏకంగా రూ. 200 కోట్లతో ఉడాయించారు

Wife And Husband Cheating Customers.. డబ్బు అంటే ఇష్టం.. ప్రేమ ఉండొచ్చు కానీ.. అత్యాశకు పోతున్నారు కొందరు. అధిక వడ్డీలు ఇస్తామని చెబితే చాలు.. ఇంట్లో ఆస్తులు, నగలు అమ్మి మరీ.. డబ్బులు ఇస్తున్నారు. చివరకు

Wife And Husband Cheating Customers.. డబ్బు అంటే ఇష్టం.. ప్రేమ ఉండొచ్చు కానీ.. అత్యాశకు పోతున్నారు కొందరు. అధిక వడ్డీలు ఇస్తామని చెబితే చాలు.. ఇంట్లో ఆస్తులు, నగలు అమ్మి మరీ.. డబ్బులు ఇస్తున్నారు. చివరకు

ఈ దంపతులు మహా ముదుర్లు… ఏకంగా రూ. 200 కోట్లతో ఉడాయించారు

ఎంత చెబుతున్నా.. ఇన్ని మోసాలు జరుగుతున్నాయని తెలిసినా కూడా అత్యాశకు పోతున్నారు జనాలు. రూపాయికి రెండు రూపాయలు ఇస్తామంటే.. ఆస్తులు అమ్మి మరీ డబ్బులు ఇస్తున్నారు. చివరకు నట్టేట ముంచేసరికి లబోదిబోమంటున్నారు. అత్యధిక వడ్డీ ఆశ చూపి భార్యా భర్తలు కోటి, రెండు కోట్లు కాదు ఏకంగా రూ. 200 కోట్లతో ఉడాయించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో ఇద్దరు దంపతులు.. ఓ ఫైనాన్స్ కంపెనీని స్థాపించి ప్రజల నుండి డబ్బులు వసూలు వేసి బిషాణా ఎత్తేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలైన నేతాజీ మేక, నిమ్మగడ్డ వాణీ బాల భాగ్యనగరిలో ఉంటున్నారు.

అబిడ్స్‌లోని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ (టెస్కాబ్)లో వాణీ బాల జనరల్ మేనేజర్‌గా పని చేస్తుంది. ఆమె భర్త నేతాజీకి శ్రీ ప్రియంక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఉంది. అందులో డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రలోభ పెట్టింది వాణీ బాల. అధిక వడ్డీ ఆశ చూపించడంతో వెనకా ముందు ఆలోచించకుండా టెస్కాబ్ అధికారులు, పలు జిల్లాల డీసీసీబీల సిబ్బంది, బ్యాంకు కస్టమర్లు, ఇరుగు పొరుగు, తెలిసిన వారంతా ఆ సంస్థలో డిపాజిట్లు చేశారు. అలా 517 మంది నుండి రూ. 200 కోట్లను వసూలు చేశారు. అయితే వాణీ బాల మరో నెల రోజుల్లో పదవీ విరమణ పొందనుండగా.. హఠాత్తుగా సెలవులు తీసుకుంది. కొన్ని రోజులకే ఫైనాన్స్ కంపెనీ కూడా మూత పడింది. వాణీ బాల లాంగ్ లీవ్ పెట్టడం.. సంస్థ మూత పడటంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

వారికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తాము మోసపోయామని గుర్తించారు కస్టమర్లు. అధిక వడ్డీ ఆశ చూపడంతో తామంతా మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 517 మంది నుండి రూ. 200 కోట్లను కొల్లగొట్టి ఉడాయించారు దంపతులు. ఇద్దరు ఫోన్లకు రెస్పాన్స్ కావకపోవడంతో పాటు సంస్థకు తాళాలు వేసి ఉండటంతో మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంత మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. ఇంకా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వాణీబాల, ఆమె భర్త నేతాజీ, కొడుకు శ్రీహర్షపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులో కొడుకు శ్రీహర్ష పాత్ర ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి