iDreamPost

పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన TDP నాయకుడు!

ఏపీ పోలీసులు పేకాట, జూదం వంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు తరచూ పేకాట శిబిరాలపై దాడులు చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో పేకాట ఆడుతూ టీడీపీ నేత పోలీసులకు అడ్డంగా దొరికాడు.

ఏపీ పోలీసులు పేకాట, జూదం వంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు తరచూ పేకాట శిబిరాలపై దాడులు చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో పేకాట ఆడుతూ టీడీపీ నేత పోలీసులకు అడ్డంగా దొరికాడు.

పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన TDP నాయకుడు!

ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరింస్తుంటారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతుంటే.. వాటిని అరికట్టే బాధ్యత కూడా ప్రజాప్రతినిధులపై ఉంటుంది. అయితే కొందరు మాత్రం ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర స్థాయి కీలక నేతల నుంచి మండల, గ్రామ స్థాయికి చెందిన నేతలు కొందరు చట్ట వ్యతిరేక పనులు చేస్తూ పోలీసులకు పట్టుపడుతుంటారు. తాజాగా కృష్ణా జిల్లాలోని ఓ మండల టీడీపీ అధ్యక్షుడు పోలీసులకు దొరికిపోయాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కృష్ణా జిల్లా కోడూరు మండలం మందపాకల శివారు ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో టీడీపీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి శ్రీనివాసరావు అలీయస్ బండే శ్రీను అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం దివిసీమలో ఇదే  తీవ్ర చర్చనీయాంశమైంది. పైకి పెద్ద మనిషిలా నీతులు చెప్పే బండే శ్రీను చట్ట వ్యతిరేకమైన జూదంలో దొరకడం పట్ల  స్థానిక ప్రజలతో పాటు ఆ పార్టీ నాయకులే చీదరించుకుంటున్నారంట. కృష్ణా జిల్లా ఎప్సీ జాషువా ఆదేశాలక మేరకు అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో సీఐ ఎల్. రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఎస్ఐ వి. రాజేంద్రప్రసాద్ మరికొంతమంది సిబ్బందితో రత్నకోడు మురుగుకాలువ గట్టుపై ఉన్న పూరిగుడిసెలో పేకాట శిబిరంపై దాడి చేసి ఏడుగురిని పట్టుకున్నారు. అంతేకాక నిందితుల నుంచి రూ.61 వేల నగదుని స్వాధీనం చేసుకున్నారు.

ఇక నిందితుల్లో టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నారంట. ఏ1 నిందితుడిగా  దొరికిన బండే శ్రీను, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అనుచరుడని సమాచారం. ఇక శ్రీనుతో పాటు పాటు జూదమాడుతూ దొరికిన మరో ఆరుగురిని పోలీసులు  అరెస్టు చేశారు. ఆ ఆరుగురు కూడా టీడీపీ కార్యకర్తలు, అందులోనూ బండే అనుచరులే కావడం గమనార్హం. ఇప్పటికే పేకాట, జూదం వంటి వాటిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడా ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొందరు మాత్రం ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరి.. పేకాట శిబిరంలో అడ్డంగా టీడీపీ నాయకుడు దొరికిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి