iDreamPost
android-app
ios-app

కుందనపు బొమ్మలా ఉన్న.. ఈ టీమిండియా క్రికెటర్‌ను గుర్తుపట్టారా?

  • Published Apr 23, 2024 | 4:56 PM Updated Updated Apr 23, 2024 | 4:56 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఓ స్టార్ క్రికెటర్. ఐపీఎల్ మ్యాచుల్లో సత్తా చాటుతోంది. కుందనపు బొమ్మలా ఉన్న ఈ క్రికెటర్ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఓ స్టార్ క్రికెటర్. ఐపీఎల్ మ్యాచుల్లో సత్తా చాటుతోంది. కుందనపు బొమ్మలా ఉన్న ఈ క్రికెటర్ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Apr 23, 2024 | 4:56 PMUpdated Apr 23, 2024 | 4:56 PM
కుందనపు బొమ్మలా ఉన్న.. ఈ టీమిండియా క్రికెటర్‌ను గుర్తుపట్టారా?

సాంకేతికత అంటే ఏంటో తెలియని రోజుల్లోనే విఠాలాచార్యుడు తన సెట్టింగ్స్ మాయాజాలంతో అబ్బుర పడిచారు. ఆ తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీతో తిమ్మిని బమ్మిని చేయొచ్చు. 2డీ, 3డీ యానిమేషన్స్, గ్రాఫిక్ డిజైనింగ్, వీఎఫ్ఎక్స్, సీజీ ఇలా వచ్చి చేరాయి. ఇవన్నీ కూడా లేనిది ఉన్నట్లు, ఉన్నట్లు లేనట్లు కనికట్టు చేసే విద్యగా మారిపోయాయి. తాటిని తన్నేవాడు ఉంటే.. వాడి తల తన్నేవాడు ఉంటాడని పెద్దలు సామెత చెప్పినట్లుగా.. టెక్నాలజీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సైన్స్ కన్నా వేగంగా సాంకేతికత జెడ్ స్పీడులో దూసుకెళుతోంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఓ మాయ ప్రపంచాన్ని సృష్టించేస్తున్నారు. మన ఫోటోల్ని మనమే నమ్మలేనంతగా అందంగా తీర్చిదిద్దుతున్నారు.

ఇప్పుడు అలాంటిదే ఈ ఫోటో కూడా. ఈ పిక్‌లో అందంగా కనిపిస్తున్న మగువ ఎవరో చెప్పగలరా..? ప్రముఖ క్రికెటర్. క్రికెటర్ అయిపోయిందీ కానీ.. హీరోయిన్లను మించి పోయిన అందగత్తెలా కనిపిస్తుంది కదూ. వెండితెరపైకి వస్తే.. మిగిలిన భామలు పెట్టే బేడా సర్దుకువాల్సిందే. చక్కనైన నుదురు, కోటేరు లాంటి ముక్కు, దొండ పండు లాంటి పెదాలు, చక్కని చుక్కలా ఉండి.. చూస్తుంటే ఆడవాళ్లకు కూడా అసూయ పుట్టే అందంతో ఉన్న ఈ బ్యూటీ ఎవరంటే.. ఇషాన్ కిషన్. అవును ఆమె .. ఆమె కాదు.. అతడు. స్టార్ క్రికెటర్ ఇషాన్. ఈ ముద్దుగుమ్మ అక్షరాలా ఇషాన్ కిషన్ ప్రతి రూపం. ఇతగాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబయి ఇండియన్ తరుఫున ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు ఈ బ్యాటర్ కమ్ కీపర్.

ఇషాన్ కిషన్‌ను ఫీమేల్ వర్షన్‌లో తయారు చేస్తే ఎలా ఉంటాడో చేసిన ప్రయత్నమే ఇది. ఎడిట్ చూస్తే కుందనపు బొమ్మలా కనిపిస్తున్నాడు ఈ కుర్రాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇషాన్ ఫోటోకి గడ్డం, మీసం తొలగించి..కాస్త హెయిర్ పెట్టి చేస్తే.. చివరకు ఇలా వచ్చాడు. ఈ వీడియో చివరిలో మరో క్రికెటర్ శుభ్ మన్ గిల్‌కు ట్యాగ్ చేయమనడం కొసమెరుపు. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే..దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి.. చిన్న వయస్సులోనే ఐపీఎల్‌కు సెలెక్ట్ అయ్యాడు. 2016-17 గుజరాత్ లయన్స్ తరుఫున ఆడిన ఈ క్రికెటర్.. 2018 నుండి ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్ జట్టులో ఆడుతున్నాడు. 2021లో టీ20, వన్డేలోకి అడుగుపెట్టాడు. 2023లో టెస్టు మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş