iDreamPost

World Cup: టోర్నీ మొదలైన తొలి రోజే వివాదం! BCCI పై విమర్శలు!

  • Published Oct 05, 2023 | 6:14 PMUpdated Oct 05, 2023 | 6:14 PM
  • Published Oct 05, 2023 | 6:14 PMUpdated Oct 05, 2023 | 6:14 PM
World Cup: టోర్నీ మొదలైన తొలి రోజే వివాదం! BCCI పై  విమర్శలు!

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ప్రారంభమైంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేచింది. అయితే.. వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌తోనే పెద్ద వివాదం రాజుకుంది. వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభ మ్యాచ్‌కు చాలా తక్కువ సంఖ్యలో ప్రేక్షకులు రావడంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌ ఇలా కొంతమంది ప్రేక్షకుల మధ్య జరుగుతుండటం అస్సలేం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో భారత క్రికెట్‌ బోర్డు(బీసీసీఐ)ని తప్పుబడుతున్నారు.

వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీ తొలి మ్యాచ్‌కు కనీసం 60 పర్సంటేజ్‌ అయినా స్టేడియం నిండకపోవడం ఏంటని అంటున్నారు. నరేంద్రమోదీ స్టేడియం ఖాళీగా కనిపిస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. పైగా ఆజ్‌ తక్‌ అనే ప్రముఖ జాతీయ మీడియా ప్రతినిధి విక్రాంత్‌ గుప్తా.. ఆసియా కప్‌ 2023 సందర్భంగా పాకిస్థాన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ జనం లేరని ఓ ట్వీట్‌ చేశారు. దానికి కౌంటర్‌గా పాకిస్థాన్‌ నుంచి భారీగా ట్రోలింగ్‌ జరుగుతుంది. ఏకంగా పాకిస్థాన్‌ దిగ్గజ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రేక్షకుల లేకపోవడం నిరాశకు గురిచేసిందంటూ ట్వీట్‌ చేశాడు.

అయితే.. ఈ విషయంలో ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సైతం బీసీసీఐని తప్పుబడుతున్నారు. వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ తొలి మ్యాచ్‌ను ముంబైలోని వాంఖేడే స్టేడియం, కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో, ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా(అరుణ్‌ జైట్లీ స్టేడియం) స్టేడియంలో, బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం లాంటి క్రౌడ్‌ ఎక్కువగా వచ్చే మైదానాల్లో కాకుండా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఎందుకు నిర్వహించారని ప్రశ్నిస్తున్నారు. అహ్మాదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌ కంటే.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా వామప్‌ మ్యాచ్‌కు ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చారని పేర్కొంటున్నారు. నిజానికి వరల్డ్‌ కప్‌ ఆరంభ మ్యాచ్‌ను టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న దేశపు టీమ్‌తో మొదలుపెడితే.. ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. ఇండియా వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌ ఆడిఉంటే.. అహ్మాదాబాద్‌ స్టేడియం నిండిపోయేదని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ ముందు యువరాజ్‌ ఎమోషనల్‌ మెసేజ్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి