iDreamPost

Chiranjeevi: చిరంజీవి ’విశ్వంభర‘ నుండి క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్ విశ్వంభర. సోషియా ఫాంటసీగా రాబోతున్న ఈ చిత్రాన్ని బింబిసార డైరెక్టర్ మల్లిడి విశిష్ట.. ఈ మూవీకి దర్శకుడు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కబోతోంది ఈ చిత్రం. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్ విశ్వంభర. సోషియా ఫాంటసీగా రాబోతున్న ఈ చిత్రాన్ని బింబిసార డైరెక్టర్ మల్లిడి విశిష్ట.. ఈ మూవీకి దర్శకుడు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కబోతోంది ఈ చిత్రం. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

Chiranjeevi: చిరంజీవి ’విశ్వంభర‘ నుండి క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి- బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేసింది యూవీ క్రియేషన్స్. ఇటీవల  ఈ సినిమా షూటింగ్ స్టార్ చేశారు. సంక్రాంతి సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది నిర్మాణ సంస్థ మూవీ క్రియేషన్స్. చిన్న వీడియోకు గూస్ బంప్స్ వచ్చాయి. కాగా, చిరంజీవి ఇంకా సెట్స్ లోకి అడుగు పెట్టలేదు. ఫిబ్రవరి నుండి ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇంకా హీరోయిన్లు ఖరారు కానీ ఈ మూవీలో ఇద్దరు బ్యూటీస్ సెలెక్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే అప్పుడే ఓవర్ సీస్ హక్కులు అమ్ముడయ్యాయి. సరిగమ సంస్థ ఫ్యాన్సీ రేటుకు రైట్స్ సొంతం చేసుకుంది. ఓవర్ సీస్ హక్కులను రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది సరిగమ సంస్థ. అయితే మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 10న విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. చిరంజీవి 156వ చిత్రంగా రాబోతుంది. కాగా, గతంలో దర్శకుడు మాట్లాడుతూ..ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని అన్నారు.

vishwambara release date locked

దీని నిమిత్తం హైదరాబాద్‌లో భారీ సెట్టింగ్ వేశారు. అయితే ఈ తరహా సినిమా కథల్లో చిరంజీవి నటించడం కత్త కాదు. .గతంలో జగదీక వీరుడు-అతిలోక సుందరి ఇలాంటి జోనరే. చిరంజీవి ఈ సినిమా పూర్తి చేశాక..తన పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయనున్నారు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డల్లో ఒకరు చిరంజీవి. మెగాస్టార్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీ పేరును దశ దిశలా తెలిసే చేసిన నటుడాయన. ఆయన చేసిన కృషికి దేశంలోనే రెండవ పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. తను చెప్పకపోయినా.. సినీ ఇండస్ట్రీకి పెద్దగా మారిపోయారు. సామాజిక పరంగా కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి