iDreamPost

ఆ దేశంలో పిల్లలకు కరోనా టీకా.. ప్రికాషనరీ డోసుపై భారత్ ఫోకస్..

ఆ దేశంలో పిల్లలకు కరోనా టీకా.. ప్రికాషనరీ డోసుపై భారత్ ఫోకస్..

కరోనాకు టీకానే శ్రీరామరక్ష.. ఇప్పటివరకు అయితే వైరస్ ఇంపాక్ట్ తగ్గింది. భారత్‌లో మూడు వేవ్ లు ముగిశాయి. ఇతర దేశాల్లో అదీ 4 వేవ్స్‌గా ఉంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు కూడా టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది. మోడెర్నా టీకాను ఆరు నుంచి 11 ఏళ్ల వయస్సు గల వారికి ఇచ్చేందుకు బ్రిటన్ మెడిసిన్స్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. వాస్తవానికి బ్రిటన్‌లో కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కూడా ఇక్కడే ఆవిర్భవించింది.

మోడెర్నా టీకా వేయడానికి మెడిసన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. చిన్నారుల సేప్టీ ముఖ్యం అని.. అందుకోసమే క్వాలిటీతో కూడిన సురక్షితమైన టీకాలు ఇవ్వాలని స్పష్టంచేసింది. బ్రిటన్‌లో ఇప్పటికే చిన్నారులు మైల్డ్ సింప్టమ్స్ పొందుతున్నారు. మరికొందరికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కొత్త వేరియంట్ భయాందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ కరోనా కేసులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

భారత్‌లో చిన్నారులకు వ్యాక్సిన్‌పై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పిల్లలకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు. ప్రస్తుతం 14 ఏళ్లపైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ప్రారంభంలో 18 ఏళ్ల కన్నా వయస్సు ఎక్కువ ఉన్న వారికే వ్యాక్సిన్‌ ఇచ్చారు. వారందరికీ తొలి డోసు పూర్తయిన తర్వాత.. 16 ఏళ్లు పైబడిన వారికి, 14 ఏళ్లు పైబడిన వారికి దశల వారీగా వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు రోజు వారీ కేసులు వేయి లోపు మాత్రమే నమోదవుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం రోజు వారీగా నమోదయ్యే కేసులు రెండు వేల మార్క్‌కు చేరుకున్నాయి. కరోనా నాలుగో వేవ్‌ రాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. భౌతిక దూరం, మాస్క్‌ ధరలించాలని చెబుతున్న ప్రభుత్వాలు.. ప్రికాషనరీ డోసును కూడా తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రికాషనరీ డోసు ప్రైవేటుగా అందుబాటులో ఉంచారు. కోవిషీల్డ్, కోవ్యాక్జిన్‌ల డోసు ధరను సర్వీస్‌ ఛార్జీలతో కలిపి 375 రూపాయలుగా నిర్ణయించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి