iDreamPost

భార్య దగ్గర మూడ్ రావడం లేదని విడాకులు! బొంబాయి హైకోర్టులో వింత కేసు!

దాంపత్య జీవితంలో శృంగారం కూడా ఓ పార్ట్. దీని గురించి ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా భార్యపై తరచుగా భర్త .. ఆమె సంసారానికి పనికి రాదంటూ ఆరోపణలు చేస్తుంటాడు. తాజాగా ఓ భార్య

దాంపత్య జీవితంలో శృంగారం కూడా ఓ పార్ట్. దీని గురించి ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా భార్యపై తరచుగా భర్త .. ఆమె సంసారానికి పనికి రాదంటూ ఆరోపణలు చేస్తుంటాడు. తాజాగా ఓ భార్య

భార్య దగ్గర మూడ్ రావడం లేదని విడాకులు! బొంబాయి హైకోర్టులో వింత  కేసు!

భార్య భర్తల బంధాన్ని దృఢంగా మార్చేది శృంగారం. జీవిత భాగస్వామిలో ఏ ఒక్కరు ఆసక్తిగా లేకపోయినా.. సంసారం అనే నావ బెడిసి కొడుతోంది. చాలా మంది కాపురాలు పెటాకులు అవ్వడానికి కూడా కారణమౌతుంది సెక్స్. భార్య తనకు సహకరించడం లేదని ఎంతో మంది భర్తలు భార్యలను వదిలేసి వెళ్లిపోతుంటారు. అలాగే ఎప్పుడు ఉద్యోగం, కెరీర్, ఊళ్లు పట్టుకుని తిరుగుతూ.. తమను పట్టించుకోని భర్తలతో విసిగిపోయిన కొంత మంది మహిళలు పడకటింటి సుఖం కోసం వివాహేతర సంబంధాలను నెరుపుతున్నారు. శృంగారం కేవలం శారీరక వాంఛ తీర్చుకోవడమే కాదు.. దీని వల్ల స్ట్రెస్ బస్టర్స్ కూడా తగ్గుతాయని, దాంపత్య జీవితం మెరుగుపడాలంటే ఇది ముఖ్యమని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అయితే ఈ శృంగారానికి సంబంధించి ఇప్పుడు ఓ విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది.

ఇప్పటి వరకు చాలా కేసుల్లో భార్య సంసారానికి పనికి రాదు అంటూ వదిలేసిన భర్తలను చూశారు. కానీ ఈ మహిళ తన మొగుడు శృంగారానికి సరిపోడు అంటూ తనకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్టెక్కింది. ఈ ఘటన బొంబాయ్ హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన భర్తలో అంగస్థంభనలో లోపం ఉందని, తనతో లైంగిక వాంఛలో పాల్గొనేందుకు నిరాకరిస్తున్నాడని, అతడు పాక్షిక నపుంసకుడని పేర్కొంటూ.. 26 ఏళ్ల మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, గత ఏడాది మార్చిలోనే ఈ దంపతులకు పెళ్లైంది. పెళ్లైన కొత్తలోనే ఈ సమస్య ఏర్పడటంతో విడిపోయారు. అనంతరం ఆమె తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కాగా, భార్య దగ్గర మాతమ్రే..తనకు మూడ్ రావడం లేదని, మిగిలిన సమయాల్లో తాను ఫర్ ఫెక్ట్ అంటూ ఫ్యామిలీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. అలాగే తనకు ఇలా లోపం బయటపడటానికి భార్యే కారణం అంటూ పేర్కొన్నాడు. అయితే విడాకులు మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ ఔరంగాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది యంగ్ పెళ్లి కూతురు. దీనిపై విచారణ చేపట్టిన విభా కంకణ్వాడీ, ఎస్జీ చపల్‌గావ్‌కర్‌లతో కూడిన ధర్మాసనం.. ‘మానసికంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కనెక్ట్ కాలేని సంసారం.. కాపురం అనిపించుకోదు. జీవితాంతం నిరాశ, నిస్పృహతో ఉండటం కన్నా విడిపోవడమే మంచిది’ అని పేర్కొంటూ యువ దంపతులకు విడాకులు మంజూరు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి