iDreamPost

తాంబూలాలు ఇచ్చేశా త‌న్నుకు చావండి…

తాంబూలాలు ఇచ్చేశా త‌న్నుకు చావండి…

“తాంబూలాలు ఇచ్చేశా , త‌న్నుకు చావండి” – ఇది క‌న్యాశుల్కంలోని డైలాగ్‌. ఇప్పుడు కౌన్సిల్ ర‌ద్దు విష‌యం కూడా జ‌గ‌న్ ఇదే అంటున్నారు. ర‌ద్దు నిర్ణ‌యం జ‌రిగిపోయిన‌ట్టే. ఇక ఇరుప‌క్షాల వాదాలు, తిట్లు , శాప‌నార్థాలు మొద‌ల‌వుతాయి.

నిజానికి కౌన్సిల్ కాని, రాజ్య‌స‌భ కాని మేధావుల చ‌ర్చా వేదిక‌గా ఉండాల‌ని ఏర్పాటైన‌వే. కానీ ఇవి కానీ రాజకీయ పున‌రావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఉపాధ్యాయులు, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఎన్ని ప్ర‌లోభాల‌తో జ‌రుగుతున్నాయో మ‌న‌కు తెలుసు. ఇక నామినేటెడ్ పోస్టుల్లో అంతా ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని వాళ్లు, లేదా ఓడిపోయిన వాళ్లు. దాదాపుగా ఉంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌కు బ‌దులుగా , అడ్డుకునే చ‌ర్చ‌లే జ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏ బిల్లు పెట్టినా వెన‌క్కి తిప్పి కొడుతున్న‌ప్పుడు, ర‌ద్దు దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి.

Read Also: మండ‌లికి మంగ‌ళం పాడితే వాళ్ల ప‌రిస్థితి ఏమిటీ?

అయితే దీనికి పార్ల‌మెంట్ ఆమోదం కావాలి. రాష్ట్రం ప్ర‌తిపాద‌న‌ని వ్య‌తిరేకించి, బీజేపీ అన‌వ‌స‌ర‌మైన త‌ల‌నొప్పి తెచ్చుకోదు. ఎందుకంటే కౌన్సిల్ ర‌ద్దు వ‌ల్ల ఆ పార్టీకి ఊడేదేమీ లేదు. జ‌గ‌న్ చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకించి ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం వాళ్ల‌కు లేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి మోదీని ప్ర‌భావితం చేసే సీన్ లేదు.

సంవ‌త్స‌రానికి రూ.60 కోట్లు ఖ‌ర్చు. 5 ఏళ్ల‌కు రూ.300 కోట్లు ఖ‌ర్చు త‌ప్పుతుంది. ఆర్థికంగా క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇది ఊర‌ట‌. అయితే ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌ని బ‌ల‌వంతంగా నెట్టిన టీడీపీ , రేప‌టి నుంచి శోకాలు ఎత్తుకుంటుంది.

Read Also: మూడు రాజధానుల ఏర్పాటును అంబేద్కరే చెప్పారు..

వాస్త‌వానికి రాజ్య‌స‌భ‌లో కూడా ఇదే. క్రికెట‌ర్లు, న‌టులు ,న‌టీమ‌ణులు ఏనాడైనా దేశం గురించి, స‌మ‌స్య‌ల గురించి నోరు విప్పారా? జ‌నం డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌డం త‌ప్ప‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి