iDreamPost

కరోనా ఎఫెక్ట్- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

కరోనా ఎఫెక్ట్- తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైలెవెల్ కమిటీతో చర్చించిన పిదప తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చ్ 31 వరకూ విద్యాసంస్థలు,కాలేజీలు,థియేటర్లు,మాల్స్ ను మూసివేయాలని నిర్ణయించారు. హైలెవెల్ మీటింగ్ లో చర్చించిన విషయాలను, మీటింగ్ నిర్ణయాలను సీఎం కేసీఆర్ కేబినెట్ ముందుంచనున్నారు.

తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని మీటింగ్ లో నిర్ణయించారు.కాగా ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలుగా 5000 కోట్ల నిధులైనా కేటాయించి కరోనాను కట్టడి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కేబినెట్ భేటీ అనంతరం హైలెవెల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశం ద్వారా కేసీఆర్ వెల్లడించనున్నారు. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలు, విద్యాసంస్థలు, మాల్స్ , థియేటర్లు మూసివేయాలని నిర్ణయించాయి.ఇప్పటికే కర్ణాటక,మహారాష్ట్ర,ఒరిస్సా,ఢిల్లీ,ఛత్తీస్ ఘడ్,ఉత్తరాఖండ్,పశ్చిమబెంగాల్,గోవా,బీహార్ తో సహా పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి.

ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా, ఐపీఎల్ వాయిదా పడగా, దక్షిణాఫ్రికా-ఇండియా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. ఏప్రిల్ 15 వరకు వీసాలను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇద్దరు కరోనా కారణంగా చనిపోగా 85 మందికి కరోనా వైరస్ సోకింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి