iDreamPost

కోరీ అండర్సన్.. భార్య కోసం దేశం మారిన క్రికెటర్ కథ!

తన భార్య కోసం ఏకంగా దేశమే మారాడు యూఎస్ఏ స్టార్ ఆల్ రౌండర్ కోరీ అండర్సన్. తొలుత న్యూజిలాండ్ కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. ప్రస్తుతం అమెరికా తరఫున క్రికెట్ ఆడుతున్నాడు.

తన భార్య కోసం ఏకంగా దేశమే మారాడు యూఎస్ఏ స్టార్ ఆల్ రౌండర్ కోరీ అండర్సన్. తొలుత న్యూజిలాండ్ కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. ప్రస్తుతం అమెరికా తరఫున క్రికెట్ ఆడుతున్నాడు.

కోరీ అండర్సన్.. భార్య కోసం దేశం మారిన క్రికెటర్ కథ!

కోరీ అండర్సన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. న్యూజిలాండ్ తరఫున క్రికెట్ కెరీర్ ఆరంభించిన అతడు.. ఎక్కువ కాలం ఆ జట్టులో ఉండలేకపోయాడు. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. ప్రధాన కారణం మాత్రం అతడి భార్య మేరీ షాంబార్గర్. ఆమె కోసమే ఏకంగా దేశం మారాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఈ క్రమంలో అతడు ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొని.. ఈ వరల్డ్ కప్ లో రాణిస్తూ.. తమ జట్టును సూపర్ 8కు చేర్చాడు.

కోరీ అండర్సన్.. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. కానీ అనూహ్యంగా ఆ దేశం తరఫున రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018లో తన చివరి మ్యాచ్ కివీస్ తరఫున ఆడాడు. ఆ తర్వాత యూఎస్ఏలో జరిగిన మేజర్ క్రికెట్ లీగ్(MLC) 3 సంవత్సరాల కాంట్రాక్ట్ కింద ఒప్పందం కుదుర్చుకుని ఆ దేశం తరఫున ఆడటం ప్రారంభించాడు. అయితే న్యూజిలాండ్ నుంచి అమెరికా దేశానికి మారాడు అండర్సన్. దానికి ప్రధాన కారణం అతడి భార్య మేరీ షాంబార్గర్. వీరిద్దరు కొన్ని సంవత్సరాలు డేటింగ్ లో ఉన్నారు. 2018 గ్రీక్ లోని ఐస్ లాండ్స్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కోవిడ్ -19 కాలంలో అండర్సన్-షాంబార్గర్ టెక్సాస్ లో కలిసి ప్రేమలో విహరించారు. 2021లో వీరు వివాహం చేసుకున్నారు.

అయితే న్యూజిలాండ్ దేశానికి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేవలం ఆమె కోసమే అమెరికా జట్టులో చేరాడు అండర్సన్. అయితే ఇది చూసి అందరూ షాక్ గురైయ్యారు. ఆ సమయంలో అండర్సన్ ను చూసి చాలా మంది ఎగతాళి చేశారు. న్యూజిలాండ్ దాటి పెద్ద దేశాన్ని వదిలి.. ఎలాంటి క్రికెట్ అనుభవం లేని పసికూన అమెరికా టీమ్ లో చేరడంతో.. అందరూ నవ్వారు. కానీ ఇప్పుడు అతడినే ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో యూఎస్ఏ సూపర్ 8కు చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ ఈ మెగాటోర్నీ నుంచి లీగ్ దశలో నిష్క్రమించి.. ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఇక ఈ టోర్నీలో ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు అండర్సన్. బంగ్లాదేశ్ పై సంచలన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు అండర్సన్. భార్య కోసం ఏకంగా దేశమే మారి, నవ్వుల పాలై.. నేడు హీరోగా తన జట్టును సూపర్ 8 కు చేర్చి ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి