iDreamPost
android-app
ios-app

OG గ్లింప్స్ మ్యూజిక్ కాపీ అంటూ ట్రోల్స్! ట్రెండింగ్ లో ‘స్ప్లాషర్’ వీడియో!

  • Author ajaykrishna Updated - 04:43 PM, Mon - 4 September 23
  • Author ajaykrishna Updated - 04:43 PM, Mon - 4 September 23
OG గ్లింప్స్ మ్యూజిక్ కాపీ అంటూ ట్రోల్స్! ట్రెండింగ్ లో ‘స్ప్లాషర్’ వీడియో!

ఇండస్ట్రీలో కాపీ ట్రోల్స్ ప్రతీ సినిమా విషయంలోను వినిపిస్తుంటాయి. కాకపోతే ఒక్కో సినిమాకి ఒక్కో విషయంలో కాపీ ట్రోల్స్ వినిపిస్తాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ గ్లింప్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సాహో ఫేమ్ సుజిత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ముంబై మాఫియా నేపథ్యంలో ఓజి సినిమా.. మోస్ట్ వయిలెంట్ గా ఉండబోతుందని గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ ని చాలా కాలం తర్వాత ఒక వయిలెంట్ యాక్షన్ రోల్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు సుజిత్. కాగా.. గ్లింప్స్ తో పాటు పవన్ కళ్యాణ్ లుక్, మేనరిజం అన్ని కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి.

ఇక ఓజి గ్లింప్స్ హైలైట్ అవ్వడానికి సుజిత్ టేకింగ్, సినిమాటోగ్రఫీ ఓ లెక్క అయితే.. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో లెక్క అంటున్నారు ఫ్యాన్స్. కానీ.. అదే తమన్ ఇచ్చిన ఓజి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ అంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అదేంటంటే.. తమన్ ఓజి గ్లింప్స్ కోసం.. ఏకంగా ఇంగ్లీష్ ‘స్ప్లాషర్’ మ్యూజిక్ ని ఫాలో అయ్యాడని అంటున్నారు. పైగా ఒరిజినల్ గా భావిస్తున్న స్ప్లాషర్ మ్యూజిక్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా.. ఆ మ్యూజిక్ వీడియోని సాక్ష్యంగా చూపిస్తూ.. ఓజి గ్లింప్స్ విషయంలో తమన్ ని మరోసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇదిలా ఉండగా.. తమన్ కి ట్రోల్స్ అనేవి కొత్త కాదు. ఇదివరకు చాలా సినిమాల విషయంలో.. చాలా సందర్భాలలో కాపీ ట్రోల్స్ ఫేస్ చేశాడు. కానీ.. మ్యూజిక్ జానర్ ఒకటే అయినప్పుడు.. ట్యూన్స్ కూడా అప్పుడప్పుడు ఒకేలా అనిపిస్తుంటాయి. ఇది ఎవరి విషయంలోనైనా జరుగుతుంటాయి. ఇప్పుడు ఓజి కోసం ఎపిడమిక్ ఎలక్ట్రానిక్ అనే యూట్యూబ్ ఛానల్ లోని ‘స్ప్లాషర్ ఆల్ఫాగన్’ అనే మ్యూజిక్ నుండి తమన్ కాపీ కొట్టి ఉంటాడని విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విషయం తమన్ వరకు వెళ్లిందో లేదో.. అసలు తమన్ స్పందిస్తాడో లేదో చూడాలి. ఇక ఓజి సినిమాని డీవీవి దానయ్య నిర్మిస్తున్నారు. మరి ఓజి గ్లింప్స్ మ్యూజిక్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş