P Krishna
Constable Organs Donated: ఇటీవల చాలా మంది తాము చనిపోతూ మరో నలుగురికి జీవితాన్ని ఇస్తున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.. ప్రాణం విలువ తెలిసిన కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.
Constable Organs Donated: ఇటీవల చాలా మంది తాము చనిపోతూ మరో నలుగురికి జీవితాన్ని ఇస్తున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.. ప్రాణం విలువ తెలిసిన కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.
P Krishna
సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత తన శరీరంలో నుంచి 200 అవయవాలు దానం చేసి ఆరేడుగురిని బ్రతికించవొచ్చని వైద్యులు చెబుతున్నారు. మనిషి ప్రాణాలు ఎంతో విలువైనవి.. తాను మరణించినా అవయవదానంతో మరో నలుగురి ప్రాణాలు నిలబెట్టవొచ్చు అంటుంటారు. ఇటీవల కాలంలో ఎంతోమందిలో అవయవదానంపై అవగాహన పెరిగిపోయి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ అవయవదానం చేస్తూ మరొకరి ప్రాణాలు కాపాడటానికి సిద్దమవుతున్నారు. ఇటీవల బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు అవయవ దానం ప్రాముఖ్యతను తెలుసుకొని తమ దుఖాఃన్ని దిగమించి దానం చేయడానికి ముందుకు వస్తూ మరోకరి ప్రాణాలు నిలబెడుతున్నారు. ఓ కానిస్టేబుల్ తాను చనిపోయి.. మరో నలుగురి జీవితాలకు వెలుగునిచ్చాడు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కు చెందిన మేకల శ్యామ్ సుందర్ (41) హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 2024, జనవరి 27న శనివారం రోజు తన ఇంట్లో హఠాత్తుకు ఉన్నచోటు కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎల్ బీ నగర్ లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు శ్యామ్ సుందర్ ని దాదాపు 22 రోజుల పాటు ఐసీయూలో కేర్ సపోర్ట్ అందిస్తూ ట్రీట్ మెంట్ చేశారు. కానీ శ్యామ్ సుందర్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 18న ఆదివారం శ్యామ్ సుందర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈ విషయాన్ని వైద్యులు జీవందన్ అవయవదానం వారికి తెలియజేశారు. హాస్పిటల్ కి చేరుకున్న జీవందన్ అవయవదాన కో-ఆర్డినేటర్లు శ్యామ్ సుందర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించారు. అవయవదానం ప్రాముఖ్యతను గురించి వివరించారు. అవయవ దానం వల్ల మరికొంతమంది జీవితాల్లో వెలుగు నింపవొచ్చని తెలిపారు. ఈ క్రమంలోనే శ్యామ్ సుందర అవయవాలను దానం చేసేందుకు సతీమణి లిఖిత సమ్మతించడంతో ఆయన అవయవాలను నలుగురు రోగులకు అమర్చారు. శ్యామ్ సుందర కుటుంబ సభ్యులు చేసిన గొప్ప పనికి అందరూ ప్రశంసించారు. శ్యామ్ సుందర్ కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.