iDreamPost

SI వ్యవహారంతో న్యాయం చేయాలంటూ మీడియా ముందుకి కానిస్టేబుల్!

  • Published Jan 31, 2024 | 6:09 PMUpdated Jan 31, 2024 | 6:09 PM

TS:రక్షణ కల్పించాల్సిన వ్యక్తులే ప్రజలకు సమస్యల మారారు. న్యాయం చేయవలసిన వ్యక్తులే అన్యాయలకు పాల్పడుతున్నారు. ఇది ప్రజల విషయంలోనే అనుకుంటే పొరపాటే. తోటి మహిళ ఉద్యోగుల పై కూడా పోలీసులు ఇలాంటి వైఖరినే చూపిస్తున్నారు. పాపం ఆ మహిళ కానిస్టేబుల్ తనకు న్యాయం చేయాలంటు కన్నీరు పెట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే..

ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో కబ్జాలు, అక్రమాలు అనేవి ఎక్కువగా పేరిగిపోతున్నాయి. వీటి గోడు నుంచి ప్రజలను కాపాడి న్యాయం చేసే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. ముఖ్యంగా రక్షణ కల్పించవలసిన వారే ఇలాంటి దందాలకు దౌర్జన్యలకు పాల్పడుతున్నారు. రోజురోజుకి వీరి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు అవసరంలా ఉండాలి కానీ, సమస్యలా మారకూడదు. తాజాగా అదే వ్యవస్థలో పనిచేస్తున్న సాటి మహిళ కానిస్టేబుల్ పై వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయంగా మారింది. న్యాయం కోసం పోరాడుతున్న ఆ లేడి కానిస్టేముల్ పై ఉన్నత అధికారులు పక్షపాతం వహిస్తున్నారు. దీంతో ఆమె తీవ్న ఆందోళనకు గురైయింది. దయచేసి న్యాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే..

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళా కానిస్టేబుల్ ఆందోళనకు దిగింది. తమ ఇంటిని కబ్జా చేశారని తనకు న్యాయం జరగలని వేడుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి ఎస్‌ఐ శివకుమార్ సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నాడని, హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆరోపించారు. తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. కానీ, అక్కడ ఎస్‌ఐ శివకుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నాడని మహిళ కానిస్టేబుల్ ఆరోపించింది. కనీసం తన ఫిర్యాదుపై దర్యాప్తు చేయకుండానే.. మాపైనే కేసులు నమోదు చేస్తున్నాడంటూ మహిళా కానిస్టేబుల్ నాగమణి కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే ఎస్‌ఐ శివకుమార్ వ్యవహారంపై రాచకొండ సీపీ విచారణ జరిపి, తనకు న్యాయం చేయాలంటూ.. ఆ మహిళా కానిస్టేబుల్ నాగమణి మీడియా ముందుకు వచ్చి వేడుకుంది. మరి, రక్షణ కల్పించలసిన పోలీసులే సాటి మహిళ కానిస్టేబుల్ పై చూపించిన వైఖరి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి