iDreamPost

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కన్నా ఎక్కువ ఉండదు: రాజా సింగ్

తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఈ నెల 7వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో..

తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఈ నెల 7వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కన్నా ఎక్కువ ఉండదు: రాజా సింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై రెండు రోజులు అధిష్టానం మల్లగుల్లాలు పడి.. ఎట్టకేలకు పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎం అని ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్. ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు నేతలకు ఆహ్వానాలు అందాయి. ఇతర రాష్ట్రాల నేతలకు ఫోన్లు చేసి ఆహ్వానించారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇక మంత్రి వర్గ కూర్పుపై చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బీజెపీ నేత రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానేలేదూ.. గోషా మహాల్ బీజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చునని, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోవచ్చునంటూ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం చాలా అప్పులు చేసిందని, వాటిని తీర్చడానికే కాంగ్రెస్ గవర్నమెంట్‌కు సమయం అయిపోతుందన్నారు. మన తెలంగాణకు వచ్చే రెవెన్యూ ఎంత, కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులను ఈ ప్రభుత్వం ఎలా తీరుస్తుందని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఎలా అమలు చేస్తోందని.. ఆ డబ్బులు ఎక్కడి నుండి తెస్తుందని ప్రశ్నించారు. బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.

తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నడుపుతుందో చూడాలని అన్నారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ ఏడాది కన్నా తెలంగాణలో నడవదంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజెపీ ప్రభుత్వం వల్లనేనని ఇక్కడి ప్రజలు అర్థం చేసుకుంటారని, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వల్లేనని అర్థం అవుతుందని అన్నారు. ఒక్క ఏడాది మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పాలన సాగుతుందని, ఆ తర్వాత పడిపోతుందని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ నుండి డబ్బులు తెచ్చి పాలన చేస్తుందని, ఇక ఆ సర్కార్ కు కష్టకాలమేనని అన్నారు. ఆ తర్వాత తమ బీజెపీ ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి