0 / 40 Mizoram |
![]() MNF |
![]() ZPM |
![]() BJP + |
![]() CONG + |
![]() OTH |
---|---|---|---|---|---|
Lead | |||||
Won |
తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ఘటనల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది.
Arjun Suravaram
ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. అలానే తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం జరగుతూనే ఉంటాయి. క్రీడా మైదానాల్లో సైతం ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకప్రాయంగా గడుపుతుంటారు. తాజాగా హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇండోర్ స్టేడియం కుప్పకూలి పోవడంతో ఘోరం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ లోని మెయినాబాద్ మండలం కనకమామిడిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు తెలిసింది. ఓ టేబుల్ టెన్నిస్ అకాడమి సంస్థ కనకమామిడిలో ఇండోర్ స్టేడియ నిర్మాణం చేపట్టింది. ఇక స్టేడియంలో కూలీలు పనులు చేస్తుండగా సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మెుత్తం కూలీలు 14 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 12 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని స్లాబ్ కింద ఇరుక్కున్న వారిని కాపాడారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు బిహార్‌కు చెందిన బబ్లు, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సునీల్‌గా గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. నిర్మాణంలో నాణ్యత లేకపోవటం కూలిందా? లేక ఏమైన ఇతర కారణాలు ఉన్నాయా? అనేది విచారణ అనంతరం తేలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.