iDreamPost

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. కృష్ణా జిల్లాలో 15వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-15: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర సోమవారం 15వ రోజు కృష్ణా జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-15: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర సోమవారం 15వ రోజు కృష్ణా జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. కృష్ణా జిల్లాలో 15వ రోజు హైలెట్స్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖరావాన్ని పూరించారు. ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లిన సీఎం జగన్.. మేమంతా సిద్ధం పేరుతో మరోసారి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుంది. ఈయాత్ర ద్వారా తాను అందించిన సంక్షేమ పథకాలను, పాలన గురించి వివరించేందుకు ప్రజల్లోకి సాగుతున్నారు. సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం 14వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగింది. ఇదే సమయంలో ఆయనపై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడిని సైతం లెక్క చేయకుండా 15వ రోజు  కూడా సీఎం జగన్ తన యాత్రను కొనసాగించారు. మరి.. 15వ రోజు కృష్ణా జిల్లాలో జరిగిన మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సోమవారం 15వ రోజూ కృష్ణా జిల్లాలో కొనసాగింది. 14వ రోజు బస్సుయాత్రలో విజయవాడలో ఆయనపై  దుండగలు సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. రాయి దెబ్బతో కలిగిన బాధను సైతం బిగపట్టి ప్రజలకు అభివాదం చేస్తూ 14వ రోజు యాత్రను పూర్తి చేశారు. ఆదివారం విరామం ఇచ్చి.. సోమవారం తిరిగి యాత్రను ప్రారంభించారు. సోమవారం 15వరోజు బస్సుయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగింది. గుడివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు జనం పోటెత్తారు. తమ అధినేతను చూసేందుకు లక్షల మంది ప్రజలు సభకు హాజరయ్యారు.

కేసరపల్లి క్యాంప్ వద్ద  దగ్గర నుంచి సీఎం జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు తన బస్సుయాత్రను ప్రారంభించారు. మేమంత సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు నైట్ క్యాంప్ వద్ద సీఎం జగన్ ను పలువురు టీడీపీ నేతలు కలిశారు. ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో  నిఘా నీడలో సోమవారం యాత్ర కొనసాగింది.  పూలు జల్లడం, క్రేన్ లతో గజమాలలపై అధికారులు ఆంక్షలు విధించారు. తేలప్రోలు, ఆత్కతూరు మీదుగా గన్నవరం జంక్షన్ కు సీఎం జగన్  బస్సుయాత్ర సాగింది.  గన్నవరం రహదారులన్ని ప్రజలతో కిక్కిరిశాయి. జొన్నపాడు వద్ద భోజనం విరామం తీసుకుని అనంతరం సీఎం జగన్ తన యాత్రను కొనసాగించారు. ఇక గుడివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్ని అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు.

సీఎం జగన్ మాట్లాడుతూ..”జగన్ మీద ఒక్కరాయి విసినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చుతుష్టయం ఓటమిని, మన పేదల ప్రభుత్వ గెలుపును ఎవ్వరూ ఆపలేరు.  ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు, బెదరడు. మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏమాత్రం తగ్గదు. విప్లవాత్మక మార్పులు మీ బిడ్డ జగన్ పాలనలో జరిగాయి.  ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్క్ కనిపిస్తోంది.  రూ. 3వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే మనది.  అలానే గ్రామ సచివాలయాల ద్వారా 600కు పైగా సేవలు అందిస్తున్నాం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రాబబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు” అని సీఎం జగన్  అన్నారు. మొత్తంగా సీఎం జగన్ కి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గుమ్మడి కాయలు, హారతితో దిష్టి తీసి సీఎం జగన్ కు మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇలా 15వ రోజు సీఎం జగన్ బస్సుయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా సాగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి