iDreamPost

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. గుంటూరు జిల్లాలో 13వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-13: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర శుక్రవారం 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-13: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర శుక్రవారం 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. గుంటూరు జిల్లాలో 13వ రోజు హైలెట్స్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్రను అపూర్వ స్పందన లభిస్తుంది. తాను అందించిన సంక్షేమ పథకాలను, పాలన గురించి వివరించేందుకు ఈయాత్ర చేపట్టి ప్రజల్లోకి సాగుతున్నారు. సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శుక్రవారం 13వ రోజు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగింది. మరి.. 13వ రోజు గుంటూరు జిల్లాలో జరిగిన మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం 13వ రోజూ గుంటూరు జిల్లాలో కొనసాగింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ధూళ్లిపాళ్ల నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా మధ్యాహ్నం వరకు సాగింది. భోజన విరామం అనంతరం చుట్టగుండ సర్కిల్, వీఐబీ రోడ్డు మీదుగా  గుంటూరు లోని ఏటూకురు బైపాస్ కు చేరుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.  సభ అనంతరం తక్కెళ్ల పాడు బైపాస్, పెదకాకాని  బైపాస్, వెంగళ్రారావు నగర్ మీదుగా నంబూర్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు.

ఇక 13వ రోజు సీఎం జగన్ చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్రకు  జనాభిమానం ఉప్పొంగింది. సంక్షేమ పాలన అందించిన సీఎం జగన్ కు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం  పట్టారు. ఇక 13వ రోజు బస్సుయాత్రలో పలువురు టీడీపీ, బీజేపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక యాత్రలో సీఎం జగన్ కు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటుండగా, ఒపికగా వింటున్న సీఎం జగన్ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. సత్తెనపల్లి చెక్ పోస్టు వద్ద సీఎంను చూసేందుకు జనం భారీగా చేరుకున్నారు. సత్తెనపల్లిలో జరిగిన రోడ్ షోలో  భారీ గజమాలలతో సీఎం జగన్ కి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గుమ్మడి కాయలు, హారతితో దిష్టి తీసి సీఎం జగన్ కు మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు.

సీఎం జగన్ తో పాటు సత్తెనపల్లిలో జన ప్రవాహం కదిలింది. దారిపొడవునా ‘మళ్లీ నువ్వే వస్తావ్ అన్నా’ అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం జగన్ బస్సు యాత్ర మేడికొండూరుకు చేరుకోగానే వర్షం ప్రారంభమైంది. అంతటి వర్షంలోనూ లెక్క చేయకుండా జనం.. సీఎం జగన్ కోసం  ఎదురు చూశారు. వర్షంలో తడుస్తూనే బస్సు మీద నుండి ప్రజలకు సీఎం జగన్ అభివాదం చేశారు. భారీ వర్షంలోనూ బస్సు యాత్రలో పండుగ వాతావరణమే కనిపించింది. ఇక గుంటూరు జిల్లాలో సాగిన సీఎం జగన్ బస్సుయాత్రలో సంక్షేమ పథకాలు, వివిధ రకాలుగా సాయం పొందిన వారు సీఎం జగన్ ను కలిసి..తమ కృతజ్ఞతలు తెలియజేశారు. పలు గ్రామాల్లోని ప్రజలు సీఎం జగన్ కు పూలు చల్లుతూ, గజమాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఇలా 13వ రోజు సీఎం జగన్ బస్సుయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా సాగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి