iDreamPost

దేశంలోనే తొలిసారి అల్పాహార స్కీం.. పిల్లలకు స్వయంగా వడ్డించిన సీఎం

దేశంలోనే తొలిసారి అల్పాహార స్కీం.. పిల్లలకు స్వయంగా వడ్డించిన సీఎం

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకమైనది. వారి  ఆరోగ్యం బాగా ఉంటేనే భవిష్యత్ తరం గొప్పగా ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు ఆరోగ్యం కోసం అనేక పథకాలను ప్రారంభించాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా పాఠశాల విద్యార్థుల కోసం ఓ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి అల్ఫాహారం పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. ఒకటి నుంచి పదో తరగతి చదివి బాలబాలికలకు తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో  ముఖ్యమంత్రి అల్ఫాహార పథకాన్ని ప్రారంభించింది.

శుక్రవారం  సీఎం స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభించి. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. సర్కార్ బడుల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు మధ్యాహ్న భోజనంతో పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతేకాక  ఈ పథకం ప్రారంభించడంతో తమిళనాడు ఓ రికార్డు సృష్టించింది. అది ఏమిటంటే దేశంలోనే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రం తమిళనాడు రికార్డు సృష్టించింది.

శుక్రవారం నాగపట్టణం జిల్లాలో సీఎం స్టాలిన్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని తిరుక్కువళై గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ  అల్ఫహార ప్రోగ్రామ్ రెండో విడతను ప్రారంభించారు. అంతేకాక సీఎం స్టాలినే చాలా సమయం పాటు చిన్నారులకు అందించే అల్పాహారాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం పిల్లలకు స్వయంగా సీఎం స్టాలిన్ బ్రేక్‌ఫాస్ట్‌ వడ్డాంచారు.  అంతేకాక తాను కూడా విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. వాస్తవానికి ఈ స్కీం 2022 సెప్టెంబరులోనే స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రయోగాత్మకంగా 1,545 పాఠశాలల్లో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది.

పేదరికంతో బాధ పడుతున్న పిల్లలకు ఆకలి బాధలు లేకుండా పాఠశాలలకు హాజరయ్యేలా చూడట ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అంతేకాక విద్యార్థుల హాజరుతో పాటు వారిలో తీవ్ర ప్రభావం చూపుతున్న రక్తహీనతను బాగా తగ్గించడం, పోషకాహార స్థితిని మెరుగుపర్చడం వంటి లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఫైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన ఈ పథకం విజయవంతం కావడంతో శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న 31,008 ప్రభుత్వ బడుల్లో విస్తరించారు. సర్కార్ బడుల్లో చదివే 15,75,900 మంది పిల్లలకు ఇప్పుడు ఈ అల్పాహార పథకం అందుబాటులోకి వచ్చింది. మరి.. స్టాలిన్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యువరాజ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ.. ఏం పేరు పెట్టారంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి