iDreamPost

లోక్ సభ ఎన్నికల్లో తమ్ముడు పోటీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

CM Revanth Reddy Clarity : తెలంగాణలో మరి కొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల బరిలో కీలక లీడర్ల కుటుంబ సభ్యులు పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

CM Revanth Reddy Clarity : తెలంగాణలో మరి కొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల బరిలో కీలక లీడర్ల కుటుంబ సభ్యులు పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల్లో తమ్ముడు పోటీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

గత ఏడాది చివరల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పదేళ్లు పారిపాలన కొనసాగించింది. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. సీఎం గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతుల చేపట్టారు.  కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల హామీపై నమ్మకంతో తమకు ప్రజలు పట్టం కట్టారని.. ఆరు గ్యారెంటీల అమలుకు తాము కట్టుబడి ఉంటామని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ పథకాలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే త్వరలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ క్రమంలోనే తన తమ్ముడు పోటీ చేయబోతున్నారన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో టికెట్ల హడావుడి కొనసాగుతుంది. కీలక లీడర్లు ఈసారి ఎంపీ బరిలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి నిలబడబోతున్నారని కొంతమంది కాంగ్రెస్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై చర్చలు షురువయ్యాయి. తాజాగా తన సోదరుడు కొండల్ రెడ్డి పోటీ చేయబోతున్నారన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా కుటుంబ సభ్యులు ఎవరూ లోక్ సభ స్థానానికి పోటీ చేయడం లేదు. పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం’ అని అన్నారు. ఇదిలా ఉంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలోనే ఆయన తన సొదరుడిని నిలబెడితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు మల్కాజ్ గిరి స్థానం నుంచి ఎంపీ టికెట్ కోసం మైనంపల్లి హనుమంతరావు పోటీ పడుతున్నారు. మరి ఈ టికెట్ ఎవరి ఖాతాలో పడుతుందో చూడాలి. బీఆర్ఎస్ నుంచి మల్కాజ్ గిరి స్థానాకి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి