iDreamPost
android-app
ios-app

మెట్రోని వదిలి వెళ్లినా నష్టం లేదు.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్

CM Revanth Reddy Warning: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

CM Revanth Reddy Warning: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మెట్రోని వదిలి వెళ్లినా నష్టం లేదు.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్

ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా నిలిచిన అంశం ఏదైనా ఉందంటే అది మెట్రో రైలుదే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ స్కీమ్ లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని వల్ల మెట్రో భారీగా నష్టపోతుందని ఇటీవల లార్సెన్ అండ్ టర్బో కంపెనీ ప్రకటించింది. మెట్రో రైళ్లను నడపడం తమ వల్ల కాదని పేర్కొంది. అయితే ఎల్ అండ్ టీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (మే15) తన నివాసంలో మీడియాతో ఎల్ అండ్ టీ చేసిన వ్యాఖ్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ప్రారంభించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్ జండర్స్ కి ఫ్రీ బస్ సర్వీస్ కల్పిస్తామని హామీ ఇచ్చాం.  కేవలం మెట్రో రైలు నష్టంతో ఈ పథకం ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఎల్ అండ్ టీ నష్టాల గురించి గానీ లాభాల గురించి గానీ ఎలాంటి బాధ లేదని.. వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి వెళ్లినా తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. వాళ్ళని వెళ్తే వెళ్లనివ్వండి.. ప్రభుత్వం దానికి ప్రత్యమ్నాయ ఏర్పాటు చేసుకుంటుంది. ఒక కాంట్రాక్టర్ వెళ్లిపోతే ఇంకో కాంట్రాక్టర్ వస్తాడని అన్నారు. ఇదేమీ పెద్ద విషయమేమీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే..ఉచిత బస్సు ప్రయాణాలు మెట్రోపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. హైదరాబాద్ లో 2026 తర్వాత మెట్రో ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకం వల్ల మెట్రో రైల్ రైడర్ షిప్ పై ప్రతికూల ప్రభావం పడిందని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్, హూల్ టైమ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ అధికారి ఆర్ శంకర్ రామన్ అన్నారు. నష్టాలు భరిస్తూ ప్రాజెక్ట్ ని కొనసాగించడం కష్టం.. అందుకే మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయా సంస్థల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.. కార్పోరేట్ల ఇష్టాయిష్టాలపై మనం ఏం చెప్పలేం అన్నారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏం జరిగినా మహాలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తాం.. మేం ప్రతి నెల టీఎస్ఆర్టీసీకి నిధులు రియంబర్స్ చేస్తున్నాం. ఉచిత బస్సు పథకం కారణంగా టీఎస్ఆర్టీసీ ని ఆర్థిక సంక్షోభంలో పడకుండా కాపాడుకునే బాధ్యత మాది అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి