iDreamPost

ప్రభుత్వ ఉద్యోగులు మా పిల్లలు.. వారి జీతాలు పెంచుతాం: కేసీఆర్‌

ప్రభుత్వ ఉద్యోగులు మా పిల్లలు.. వారి జీతాలు పెంచుతాం: కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కీలక ప్రకటన చేశారు. త్వరలో ఉద్యోగుల జీతాలు పెంచుతామని అన్నారు. అది కూడా దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచుతామని అన్నారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలని అన్నారు. దేశం ఆశ్చర్యపోయేలా మరోసారి వారి జీతాలను పెంచుతామని చెప్పారు. అంతేకాదు! త్వరలోనే పే స్కేలు, ఐఆర్‌ ఇస్తామని కూడా అన్నారు.

ముఖ్యమంత్రి ప్రకటనతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కేసీఆర్‌ గతంలో ఒకసారి 43 శాతం.. మరోసారి 30 శాతం వేతనాలు పెంచారని ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్‌ మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి మమత తెలిపారు. ఇలా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని అన్నారు. ఈ ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి స్నేహ పూర్వక మద్దతు ఉందని తెలిపారు. ఉద్యోగుల శ్రమను గుర్తించి, వివిధ శాఖల పనితీరును ప్రశంసించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా వేతన లబ్ధి చేకూర్చటం కేసీఆర్‌ నిబద్ధతకు నిదర్శనమన్నారు. కాగా, ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును కూడా తెలంగాణ శాసన సభ ఆమోదించింది. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఆస్తులు యథాతథంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తామని, ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ కూడా వర్తిస్తుందని తెలిపింది. మరి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు.. దేశం ఆశ్చర్యపోయేలా మరోసారి జీతాలు పెంచుతామని ప్రకటన చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి