iDreamPost

హైదరాబాద్ పబ్‌లలో ఆగని అలాంటి పనులు.. నిర్వాహకులపై కేసు!

  • Published May 05, 2024 | 12:35 PMUpdated May 05, 2024 | 12:35 PM

Task Force Attacks Pubs: హైదరాబాద్ లో ఇటీవల పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల సిటీలోని కొన్ని పబ్ లలో అసాంఘిక కార్యకలాపాలు.. అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందండో పోలీసులు రైడ్ చేస్తున్నారు.

Task Force Attacks Pubs: హైదరాబాద్ లో ఇటీవల పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల సిటీలోని కొన్ని పబ్ లలో అసాంఘిక కార్యకలాపాలు.. అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందండో పోలీసులు రైడ్ చేస్తున్నారు.

  • Published May 05, 2024 | 12:35 PMUpdated May 05, 2024 | 12:35 PM
హైదరాబాద్ పబ్‌లలో ఆగని అలాంటి పనులు.. నిర్వాహకులపై కేసు!

గత కొంత కాలంగా హైదరాబాద్ లో పార్టీ కల్చర్ రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. యూత్ చాలా వరుకు ఎంజాయ్ మెంట్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇదిలా ఉంటే.. పబ్ ల నిర్వహణపై పోలీసులు ఎన్ని మార్గదర్శకాలు ఇచ్చినా.. పబ్ నిర్వహకులు తీరు మారడం లేదు. కొన్ని పబ్ లు మద్యం, డ్రగ్స్, వ్యభిచారం ప్రధానంగా కేంద్రంగా సాగుతుందని పోలీసులు అంటున్నారు. ఎన్నిసార్లు రైడు చేసినా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా వీరి తీరు మారడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి పబ్ లో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువకుల నుంచి అడ్డగోలుగా డబ్బులు గుంజుతున్నారని.. అలాంటి పబ్ లపై ఉక్కుపాదం మోపుతున్నామని టాస్క్ ఫోర్స్ అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రం పలు పబ్ లపై దాడులు చేసినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ బంజార హిల్స్ లో ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది అమ్మాయిలను తీసుకు వచ్చి పబ్ లో అసభ్యకరమైన అశ్లీల నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఆఫ్టర్ నైన్ పబ్ లో శనివారం రాత్రి పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులతో పాటు పబ్ కు వచ్చిన యువతీ యువకులను స్టేషన్ కి తరలించారు. పబ్ ను వెంటనే ముసివేయించారు. నగరంలో చాలా వరకు పార్టీ కల్చర్ బాగా పెరిగిపోయిందని.. వీక్ ఎండ్ వస్తే చాలు పబ్ లకు వెళ్తున్నారని.. వీరి బలహీనతలు కొంతమంది పబ్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారని పోలీసులు అంటున్నారు.

హైదరాబాద్ లో కొన్ని పబ్ లకు మాత్రమే అనుమతులు ఉన్నాయని.. మిగతావి ఎలాంటి అనుమతులు లేకున్నా ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఇలాంటి పబ్ లకు యూత్ వెళ్లడం వల్ల ఇబ్బందులు పడతారని.. అరెస్టులు చేసి జైల్లో వేస్తారని తెలిసినా వెళ్తున్నారని అంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసులు, ఉన్నతాధికారులు తరుచూ పబ్ లపై దాడులు చేస్తూ నిర్వాహకులపై కేసులు పెడుతున్నారు. శనివారం రాత్రి ఆఫ్టర్ నైట్ క్లబ్ లో పోలీసులు రైడ్ చేసి అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్న యువతులను,నిర్వహాకులను, పబ్ కి వచ్చిన 35 మంది యువతులతో పాటు 167 మందిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి