iDreamPost

ప్రజల్లోకి జగన్‌.. రచ్చబండకు ముహూర్తం ఖరారు

ప్రజల్లోకి జగన్‌.. రచ్చబండకు ముహూర్తం ఖరారు

పరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో అడుగు వేయబోతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, పరిపాలన, సంక్షేమ పథకాల అమలును తెలుసుకునేందుకు, ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు సీఎం జగన్‌ ఆగస్టు నుంచి రాష్ట్రంలోని గ్రామాల పర్యటన చేపట్టనున్నారు. రచ్చ బండ తరహాలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రజలతో నేరుగా సమావేశం కానున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు అందుతున్న తీరు, స్థానిక సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకోనున్నారు. ఆగస్టులో గ్రామాల పర్యటన ప్రారంభిస్తానని సీఎం జగన్‌ ఈ రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలపై జరిగిన సమీక్షలో ఈ మేరకు తన పర్యటన గురించి సీఎం జగన్‌ ప్రస్తావించారు.

అర్హతే ఆధారంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్‌ ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా అన్ని పథకాలను అర్హులకు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. ఆగస్టులో చేపట్టబోయే తన పర్యటనలో గ్రామాల్లో ఎవరూ మాకు అర్హత ఉన్నా.. ఫలానా పథకం అందడంలేదని చెప్పే పరిస్థితి ఉండకూదని సీఎం జగన్‌ పురుద్ఘాటిస్తున్నారు. ఒక వేళ అర్హత ఉన్నా.. పథకం అందకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

గత ఏడాది అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రచ్చబండ తరహా కార్యక్రమం చేపట్టాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ప్రస్తుతంతన ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవడం, మేనిఫెస్టోలోని హామీల్లో 90 శాతం అమలు చేయడం, పరిపాలనలో విధాన పరమైన నిర్ణయాల అమలుతో ఓ వైపు పరిపాలన మరో వైపు సంక్షేమం పరుగులు పెడుతోంది. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోపాటు.. సంక్షేమ పథకాలు తాను అనుకున్నట్లు ప్రజలకు అందుతున్నాయా..? లేదా..? అనేది స్వయంగా తెలుసుకుని లోటుపాట్లన సరి చేసేందుకు సీఎం జగన్‌ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి