iDreamPost

ఆరోగ్య రంగంలో పెనుమార్పులకు సి.యం జగన్ శ్రీకారం

ఆరోగ్య రంగంలో పెనుమార్పులకు సి.యం జగన్ శ్రీకారం

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే దేవాలయాలు ఆసుపత్రులు అంటారు కానీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రులలో సరైన సదుపాయాలు లేక యమపురికి మార్గాలుగా తయారయ్యాయి. గుంటూరు ప్రభుత్వం ఆసుపత్రిలో ఐ.సి.యు లో ఉన్న 10 రోజుల పసి గుడ్డుని ఎలుకలు కొరికి చంపటం దగ్గరనుండి. సెల్ ఫోన్ టార్చ్ కాంతిలో ప్లాస్టిక్ సర్జరీ చేసిందాక , బెడ్లు లేక రోగులను నేల మీద పడుకోపెట్టడం దగ్గర నుండి ఆక్సిజన్ కొరతతో అనంతపూర్ మహిళ అంబులెన్స్ లోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన వరకు నాటి ప్రభుత్వ హయాంలో పర్యవేక్షణ కరువై వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా దిగజారిపోయింది.

వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైద్య ఆరోగ్య శాఖలో పెను మార్పులు తీసురాబోతున్నట్టు చెప్పిన విధంగానే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 117 వ్యాధులను 2059కి పెంచారు. ప్రజలకు వెయ్యి రూపాయలకు మించి ఖర్చు అయితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చారు. హైద్రబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల కోసం అక్కడ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద చెల్లించాల్సిన బకాయి 600 కోట్లు జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్చారు . కిడ్నీ పేషంట్లకు 10 వేలు చెల్లిస్తున్నారు. ఇక తాజాగా ప్రజా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా మరో అడుగు ముందుకు వేసి నాడు-నేడు కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చబోతునట్టు ప్రకటించారు.

వైద్య రంగం పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్న సీఎం వైయస్‌ జగన్‌ తాజాగా ప్రకటించిన నాడు – నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. గత ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు నాడు–నేడు కింద అభివృద్ధి పనులకు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16 వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ప్రస్తుతం ఎటువంటి సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో సకల సదుపాయాలు కల్పించడంతో పాటు, వైద్య పరికరాలను సమకూర్చడమే లక్ష్యంగా వైద్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ఈ పనులకు జూన్‌ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన పనులను ఆర్‌ అండ్‌ బీకి.. సబ్‌సెంటర్ల పనులను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సి.యం జగన్ ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో మార్చేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామాల్లో ఆసుపత్రుల నుంచి భోదనాసుపత్రుల వరకు అన్నిటిని దశల వారీగా రూపురేఖలు మార్చబోతునట్టు. మొదటి దశలో 7458 సబ్ సెంటర్లలో ఈ పధకం అమలు చేయబోతునట్టు అలాగే 4906 కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు ఇక రెండో దశలో 52 ఏరియా ఆసుపత్రుల ఆదునీకీకరణతో పాటు కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించి రాష్ట్రంలో ప్రజారోగ్య బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళుతునట్టు తెలిపారు . ఏది ఏమైనా గడచిన పాలకుల వలన తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వైద్య రంగం వై.యస్ జగన్ రాకతో కొత్త రూపు సంతరించుకుంటుందని చెప్పొచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి